Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ చాలా రసవత్తరంగా మారింది. టైమ్ టాస్క్ లో అందరికంటే బాగా టైమ్ ని లెక్కబెట్టిన మానస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత షణ్ముక్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్ తర్వాత ప్లేస్ లో దక్కించుకోగా సన్నీ అందరికంటే ఎక్కువ టైమ్ ని లెక్కబెట్టి లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక బెడ్ పై రిలాక్స్ గా పడుకుని షణ్ముక్ ఇంకా కాజల్ ఒకరికొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇద్దరూ కూడా చాలా స్మార్ట్ గా ఆలోచిస్తూ లాజికల్ గా మాట్లాడుతూ బాగా దెబ్బలాడుకున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గలేదు.

నాది తప్పు అయితే హౌస్ లో నీకంటే ముందు నేనే వెళ్లిపోతా అంటూ షణ్ముక్ చెప్పాడు. ఇక్కడ తప్పు ఉన్నవాళ్లు వెళ్లిపోతారా అంటూ కాజల్ కౌంటర్ వేసింది.సిరి అసలు నీ దగ్గర బాల్స్ లాక్కునే ప్రయత్నమే చేయలేదు. అంటూ మొదలైన ఈ డిస్కషన్ ఘర్షణగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు బాగా వాదించుకున్నారు. సన్నీ సిరి దగ్గరకి రాకపోయినా సరే కాళ్లు ఐస్ లో నుంచీ తీయలేదు షణ్ముక్ అంటూ చెప్పింది. దీంతో షణ్ముక్ అసలు నువ్వు ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావ్ అంటూ సూటిగా అడిగాడు. స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నావ్ అంటూ రెచ్చిపోయాడు. దీంతో కాజల్ నువ్వే తెగేవరకూ లాగుతున్నావ్ అంటూ గట్టి వాదన చేసింది. ఇక ఈ వాదన అయిపోయిన తర్వాత షణ్ముక్ ఇప్పుడు బయటకి వెళ్లి మానస్ తో సన్నీతో చెప్పి స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తుంది.

జనాలు కూడా నమ్మేసి ఓట్లు వేసేస్తారు. ఇలాంటి గేమ్స్ మేము చిన్నప్పుడే ఆడేశాం అంటూ కాజల్ స్ట్రాటజీ గురించి బయటపెట్టే ప్రయత్నం చేశాడు. కాజల్ తో కావాలనే వాదన పెట్టుకున్నాడు. సన్నీ నామినేషన్స్ లో లేనపుడు సన్నీ ఫ్యాన్స్ ఓట్లు కాజల్ కి పడతాయని ప్రియాంకకి ముందే చెప్పాడు. ఇప్పుడు కాజల్ థింకింగ్ స్మార్ట్ అని, స్ట్రాటజీ అని నిరూపిస్తే సిరి సేఫ్ జోన్ లో ఉంటుందని మాస్టర్ ప్లాన్ వేశాడా అనిపించింది.ఇక్కడ మానస్ సిరికి హెల్ప్ చేస్తుంటే షణ్ముక్ వద్దని చెప్తున్నాడని అన్నాడు. పక్కనే సన్నీ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పాడు. ఇక టాస్క్ లో మూడో లెవల్ మొదలైన తర్వాత హౌస్ మేట్స్ గేమ్ ని చాలా సీరియస్ గా తీస్కున్నారు. స్కిల్ కి సంబంధించిన జెండాని ఎగరేశారు.

అయితే, ఇక్కడే సిరి బదులుగా షణ్ముక్ , శ్రీరామ్ కి బదులుగా సన్నీ గేమ్ ఆడేందుకు అంగీకరించారు. సిరి బదులు షణ్ముక్ గేమ్ ని బాగా ఆడాడు. శ్రీరామ్ బదులు సన్నీ చాలా స్పీడ్ గా గేమ్ ని ఫినిష్ చేశాడు. దీంతో ఫైనల్ రేసులో సిరి, శ్రీరామ్ ఇద్దరూ నిలబడ్డారు. మూడు లెవల్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ పాయింట్స్ ని ఎనౌన్స్ చేశాడు. మానస్ అందరికంటే ఎక్కువగా 18 పాయింట్స్ తో ఉంటే, శ్రీరామ్ 16 పాయింట్స్, సిరి 15 పాయింట్స్, సన్నీ 10 పాయింట్స్ తో షణ్ముక్ 10 పాయింట్స్ తో సమానం అయ్యారు. కాజల్ ఇంకా ప్రియాంక ఇద్దరూ పోటీ నుంచీ తప్పుకున్నారు. మూడో వ్యక్తిగా ఎవరు తప్పుకుంటారు అనేదానిపైన సన్నీకి, షన్నూకి వీరిద్దరికీ మళ్లీ పోటీ జరిగింది. ఇందులో సన్నీ స్పీడ్ గా టాస్క్ ని కంప్లీట్ చేశాడు. సన్నీ ఫినాలే రేస్ లో నిలబడ్డాడు. దీంతో షణ్ముక్ రేస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus