Bigg Boss 5 Telugu: కార్నర్ బ్యాచ్ కి క్వాయిన్ పగిలింది అంటున్న నెటిజన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ లో రవి రాకుమారుడు రాజుగా ఎంపికయ్యాడు. ప్రజల మద్దతుతో రాజుని ఎంచుకోవాల్సిన టైమ్ లో రవివైపు 7గురు ఉండటం వల్ల రవి రాజాగా కిరీట్ పెట్టుకున్నాడు. ఇక్కడ బాహుబలి నేనే అంటా, భళ్లాల దేవ రాజు అంటూ సన్నీ చేసిన కామెడీ సూపర్ అనే చెప్పాలి. ఈ ఫన్ జరుగుతున్నట్లుగా సిరి అండ్ జెస్సీ లు ఇద్దరూ కూడా సన్నివైపు కేవలం కెప్టెన్సీ కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. అంతేకాదు , షణ్ముక్ ని నువ్వు నామినేట్ చేసినా కూాడ అది మనసులో పెట్టుకుని గేమ్ ఆడాడా లేదు కదా అంటూ చెప్పింది.

అలాగే, కాజల్ కూడా నిన్ను నామినేట్ చేసింది. కానీ గేమ్ ఎందుకు నీసైడ్ వచ్చి ఆడిందంటూ చెప్పింది. దీంతో సన్నీ ఎందుకు సపోర్టర్స్ రివర్స్ అవుతున్నారో తెలియక తలపట్టుకున్నాడు. జెస్సీ నాకోసం వీళ్లిద్దరూ సిరి, ఇంకా షణ్ముక్ లు వచ్చారంటూ చెప్పాడు.ఈ టాస్క్ లో షణ్ముక్ క్వాయిన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కీలకమైన గేమ్ ప్లాన్ వేశాడు. జెస్సీ, మానస్, తన దగ్గర ఎక్కువ క్వాయిన్స్ ఉండేలా స్కెచ్ వేశారు. కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టింది. గెలిచి రాజ్యం నుంచే కెప్టెన్సీ పోటీదారులు రావాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేసరికి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిజానికి టాస్క్ జరుగుతున్నంత సేపు షణ్ముక్ శ్రీరామ్ ని టార్గెట్ చేస్తునే ఉన్నాడు.

తను ఈసారి హమీదాని కెప్టెన్ చేయాలని భావిస్తున్నాడని, రేషన్ మేనేజర్ మళ్లీ శ్రీరామే అవుతాడని అది నాకు ఇష్టం లేదని చెప్తూ వచ్చాడు షణ్ముక్. అంతేకాదు, టాస్క్ లో విశ్వని వెటకారం చేయడం, నోరూజారి మాట్లాడటం అన్నీ కూడా చేస్తూ వచ్చాడు. అందుకే, బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి వీళ్లు అద్దరిపడ్డారు. దీంతో కార్నర్ బ్యాచ్ క్వాయిన్ పగిలిపోయింది. ముఖాలు మాడిపోయినాయ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షణ్ముక్, సిరి, ఇంకా జెస్సీలు కార్నర్ బ్యాచ్ గా బిగ్ బాస్ హౌస్ లో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదీ మేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus