Shanmukh: దీప్తిపై ట్రోలింగ్.. స్పందించిన షణ్ముఖ్!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ విన్నర్ గా సన్నీ.. రన్నరప్ గా షణ్ముఖ్ జశ్వంత్ నిలిచారు. నిజానికి షో మొదలైనప్పటి నుంచి విన్నర్ రేసులో షణ్ముఖ్ ఉన్నాడు. ఒకానొక దశలో అందరూ ట్రోఫీ షణ్ముఖ్ కే వస్తుందని ఊహించారు. దానికి తగ్గట్లే ఎన్నిసార్లు నామినేషన్ లో ఉన్న సేవ్ అయిపోతూ ఉండేవాడు షణ్ముఖ్.

హౌస్ మేట్స్ అందరి స్ట్రాటజీలను అంచనా వేస్తూ.. బిగ్ బాస్ సీజన్ 5లో బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. కానీ టైటిల్ మాత్రం అతడికి రాలేదు. ఈ విషయం తను ముందే ఊహించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. పదకొండో వారం తరువాత కప్పు తనకు రాదేమో అనుకున్నానని.. సిరితో జరిగిన గొడవ తరువాత అలా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. షణ్ముఖ్ హౌస్ లో ఉన్నప్పుడు అతడి గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా స్టేజ్ పైకి వచ్చింది.

ఆ సమయంలో ఆమె షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నాడని.. హింట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. స్టేజ్ పై ఉన్న దీప్తి తన రెండు వేళ్లతో మైక్ ని పట్టుకొని.. షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నాడని చెప్పిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాను అలా చేయలేదని దీప్తి క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం ఆమెని బాగా ట్రోల్ చేశారు. తాజాగా ఇదే విషయంపై షణ్ముఖ్ కూడా స్పందించారు.

‘మా అమ్మ మీద ఒట్టు.. నాకు ఆ విషయం తెలియదు. అయినా దీప్తి అలా చెప్పదు. నాకు చీటింగ్ చేయడం రాదు. ఒకవేళ నిజంగానే దీప్తి అలా చెప్పి ఉంటే సిరితో స్నేహం ఎందుకు కంటిన్యూ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీప్తి తనకు ఎలాంటి హింట్స్ కానీ సిగ్నల్స్ కానీ ఇవ్వలేదని తేల్చి చెప్పాడు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus