Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » శరభ

శరభ

  • November 22, 2018 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శరభ

దర్శకుడు శంకర్ మరియు ఆర్.నారాయణమూర్తిల వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన నరసింహారావు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “శరభ”. ఆకాష్ కుమార్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రం ద్వారా జయప్రద తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. గ్రాఫికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం చాన్నాళ్లపాటు విడుదలకు ఇబ్బందులు పడి ఎట్టకేలకు ఇవాళ (నవంబర్ 22) విడుదలైంది. మరి ఈ మైథలాజికల్ విజువల్ వండర్ జనాల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!sharabha-1

కథ : 18 శక్తి పీఠాల మీద పట్టు సాధించిన మహా మాంత్రికుడు చంద్రాక్షుడు సర్వశక్తులు సొంతం చేసుకోవాలంటే.. 18 మంది దివ్య కన్యలను బలి చేయాలి. 17 మందిని బలి చేసిన తర్వాత 18 కన్య కోసం వెతికే క్రమంలో మరణిస్తాడు. చంద్రాక్షుడి మరణం అనంతరం అతడి కుమారుడు (చంద్రదీప్) ఆ బాధ్యతను స్వీకరిస్తాడు.

కట్ చేస్తే.. సింగారిపురం అనే గ్రామంలో మామయ్య చిన్నారావు (నాజర్)తో కలిసి బలాదూర్ తిరుగుతుంటాడు శరభ (ఆకాష్ కుమార్). చంద్రాక్షుడి కుమారుడు వెతుకుతున్న 18వ దివ్యకన్య దివ్య (మిస్తీ చక్రవర్తి) అదే ఊరు వస్తుంది. మొదట్లో టామ్ & జెర్రీలా గొడవపడినా.. త్వరగానే రోమియో-జూలియట్ వలె అమర ప్రేమికులుగా మారిపోతారు. దివ్యను వెతుక్కుంటూ సింగారిపురం వచ్చిన దుష్టుడికి శరభ అడ్డంగా నిలుస్తాడు.

ఆ దుష్ట శక్తిని శరభ దైవ బలంతో కూడిన మానవశక్తితో ఎలా జయించాడు? అనేది “శరభ” కథాంశం.sharabha-2

నటీనటుల పనితీరు : హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఆకాష్ కుమార్ స్క్రీన్ ప్రెజన్స్ చాలా యావరేజ్ గా ఉన్నప్పటికీ.. యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్ లో మాత్రం పర్వాలేదు అనిపించుకొన్నాడు. అయితే.. నటుడిగా కొనసాగాలి అనుకొంటే మాత్రం హావభావాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.

“చిన్నదాన నీకోసం” ఫేమ్ మిస్తీ చక్రవర్తికి మంచి పాత్ర లభించింది కానీ.. నటనతో ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్ లో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ.. పెద్దగా మెప్పించలేకపోయింది.

చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన జయప్రద.. తన సీనియారిటీ మరోసారి నిరూపించుకొంది. సెంటిమెంట్ సీన్స్ లో ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక అతిధి పాత్రలో నెపోలియన్ ఆకట్టుకొన్నాడు. తాను ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలను అని మరోమారు నిరూపించుకొన్నాడు.sharabha-3

సాంకేతికవర్గం పనితీరు : ముందుగా ఈ సినిమాకి 22 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టించిన దర్శకుడు నరసింహారావు గురించి మాట్లాడుకోవాలి. ఒక కొత్త హీరోను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు భీభత్సమైన సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేనప్పుడు ఇంత ఖర్చు పెట్టించడం అనేది చాలా పెద్ద నేరం. పైగా.. సినిమా కథ “ఢమరుకం”ను గుర్తుచేస్తే.. కథనం 90ల కాలంలో కోడి రామకృష్ణగారు తెరకెక్కించిన ఫాంటసీ సినిమాలను గుర్తుకుచేస్తుంది. శంకర్ దగ్గర చేసిన శిష్యరికం గ్రాఫిక్స్ & ఆర్ట్ వర్క్ లో మాత్రమే కనిపించింది. కథనం విషయంలో మాత్రం తన మరో గురువు అయిన ఆర్.నారాయణమూర్తి స్థాయి కూడా కనిపించలేదు. మొదటి 15 నిమిషాల్లోనే క్లైమాక్స్ ఏమిటనేది అర్ధమైపోయేలా కథనం రాసుకొన్న నరసిమహారావు.. సినిమాను అనవసరమైన సన్నివేశాలు, ఎలివేషన్స్ తో సాగదీసిన విధానం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

కోటి సంగీతం సోసోగా ఉన్నా.. నేపధ్య సంగీతం సినిమాలోని కంటెంట్ కు తగ్గట్లు ఉంది. రమణ సాల్వ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొంటే బాగుండేది. గ్రాఫిక్స్ వర్క్, డి.ఐ మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. ఆర్ట్ వర్క్ లో ఒక్కటంటే ఒక్క మిస్టేక్ కూడా లేకపోవడం ప్రశంసనీయం.sharabha-4

విశ్లేషణ : కథ, కథనంతో సంబంధం లేకుండా అలరించే గ్రాఫిక్స్ మరియు కళా నైపుణ్యాన్ని ఎంజాయ్ చేసేవారు మాత్రమే ఈ సినిమా చూడొచ్చు. ట్రైలర్ లో గ్రాఫిక్స్ చూసి ఏదో ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్తే మాత్రం దారుణంగా నిరాశ చెందుతారు.

sharabha-5

రేటింగ్ : 1.5/5

Click Here To Read In ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakash kumar
  • #Interview
  • #Jaya Prada
  • #Mishti Chakravarty
  • #Movie Review

Also Read

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

The Girl Friend Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

related news

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jatadhara Review in Telugu: జటాధర సినిమా రివ్యూ & రేటింగ్!

Jatadhara Review in Telugu: జటాధర సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

5 hours ago
ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

9 hours ago
Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

9 hours ago
The Girl Friend Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

10 hours ago
Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

10 hours ago

latest news

Rashmika Mandanna: ‘శ్రీవల్లి’ ట్యాగ్ నుంచి పారిపోయేందుకే.. రష్మిక ‘5 పాత్రల’ వ్యూహం!

Rashmika Mandanna: ‘శ్రీవల్లి’ ట్యాగ్ నుంచి పారిపోయేందుకే.. రష్మిక ‘5 పాత్రల’ వ్యూహం!

23 hours ago
Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

23 hours ago
Akhanda 2: కూలీ, ఓజీ.. ఇప్పుడు అఖండ 2తో ఈ రికార్డు సాధ్యమేనా?

Akhanda 2: కూలీ, ఓజీ.. ఇప్పుడు అఖండ 2తో ఈ రికార్డు సాధ్యమేనా?

24 hours ago
Janhvi Kapoor: మృణాల్‌ను మార్చిన టాలీవుడ్.. జాన్వీని ఎందుకు మార్చట్లేదు?

Janhvi Kapoor: మృణాల్‌ను మార్చిన టాలీవుడ్.. జాన్వీని ఎందుకు మార్చట్లేదు?

1 day ago
Suma Kanakala: “ఏంటి వీళ్లు విడిపోలేదా?”.. ట్రోల్స్‌కు సుమ పర్ఫెక్ట్ కౌంటర్!

Suma Kanakala: “ఏంటి వీళ్లు విడిపోలేదా?”.. ట్రోల్స్‌కు సుమ పర్ఫెక్ట్ కౌంటర్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version