Sharwanand: ‘ఒకే ఒక జీవితం’తో రెండు పనులు పూర్తి!

‘‘శర్వానంద్‌.. కెరీర్‌ అస్సలు బాలేదు.. ఈ సినిమా కూడా తేడా కొడితే కష్టమే’’ – ‘ఒకే ఒక జీవితం’ సినిమా విడుదలకు ముందు చాలామంది నోట వినిపించిన మాట ఇదే. ఎందుకంటే ఆయన కెరీర్‌లో వరుసగా ఫ్లాప్‌లే ఉన్నాయి. సుమారు ఆరు ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన హిట్‌ ఇది. ఈ సినిమా విజయం శర్వాకు టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ ఫుల్‌ బూస్టప్‌ వచ్చింది అని అంటున్నారు పరిశ్రమ పరిశీలకులు. సినిమా టాక్‌, అతనికొస్తున్న పేరు రెండు చోట్లా బాగుంటమే దీనికి కారణం.

‘మ‌హానుభావుడు’ సినిమాతో ఐదేళ్ల క్రితం విజయం అందుకున్నాడు శర్వానంద్‌. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు తప్ప సరైన విజయం మాత్రం దక్కలేదు. దీంతో శర్వా కెరీర్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. శర్వానంద్‌కి కెపాసిటీ ఉన్నప్పటికీ.. సరైన సినిమా పడటం లేదు అని అనుకున్నారు. మాస్‌ సినిమాలు కాకుండా, తన జోనర్‌ అయితే స్పెషల్‌ మూవీస్‌ చేయాలని కోరుకున్నారు. ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో అలాంటి విజయం దక్కింది.

నిజానికి ‘ఒకే ఒక జీవితం’ సినిమా విడుదలకు ముందు సరైన బజ్‌ లేదనే చెప్పాలి. ఏదో ఓ సినిమా వస్తుంది, వెళ్లిపోతుంది అని నవ్వుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే శర్వాకు ఈ సినిమా మీద ఎక్కడో చిన్న నమ్మకం ఉంది. అందుకే ఎంతో కష్టపడి సినిమాను ప్రమోట్‌ చేసుకున్నాడు. అనుకున్నట్లుగా సినిమాకు ఇప్పుడు మంచి ఆదరణ దక్కుతోంది. టాలీవుడ్‌లోనే కాదు, తమిళ పరిశ్రమలోనూ ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. అక్కడ ‘కణమ్‌’ పేరుతో విడుదలై మంచి పేరు తెచ్చుకుంటోంది.

చాలా ఏళ్ల కింద‌టే ‘జ‌ర్నీ’ సినిమాతో త‌మిళంలో స‌క్సెస్ అందుకున్నాడు శర్వానంద్‌. ఆ త‌ర్వాత ఆ విజ‌యాన్ని అక్కడ నిల‌బెట్టుకోలేక‌పోయాడు. కొన్నేళ్ల తర్వాత చేర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసినా.. అది విడుదలవ్వడానికి చాలా ఇబ్బందులు పడింది. అయితే పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేసి హమ్మయ్య అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘కణమ్‌’ మళ్లీ శర్వాకు తమిళ నాట కూడా విజయాన్ని అందించింది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus