టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఒకప్పుడు ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారారు శర్వానంద్. ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’ ఇలా ఎన్నో హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. తన సినిమాలకు పాతిక నుంచి ముప్పై కోట్ల మార్కెట్ ఉంది.
కానీ కొన్నాళ్లుగా అతడి నుంచి ఒక్క సరైన సినిమా రాలేదువరుస ఫ్లాపులతో అతడి మార్కెట్ బాగా దెబ్బతింది. ఇప్పుడు శర్వానంద్ మీద కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అతడి లేటెస్ట్ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఫుల్ రన్ లో రూ.5 కోట్ల షేర్ ని కూడా దాటలేకపోయింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి పేరున్న దర్శకులు, నిర్మాతల నుంచి అవకాశాలు రావడం కష్టంగా మారింది.
ఎంత టాలెంట్ ఉన్నా.. సినిమా ఇండస్ట్రీ హిట్టు, ఫ్లాప్ ల మీదే నడుస్తుంది. వరుస ఫ్లాప్ లు వస్తే మాత్రం కెరీర్ డోలాయమానంలో పడాల్సిందే. శర్వానంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పుడు డిస్కషన్స్ లో ఉన్న కొన్ని సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘ఒకే ఒక జీవితం’ సినిమాపైనే ఉన్నాయి. నిజానికి ఇదొక బైలింగ్యువల్ సినిమా. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమాను తమిళ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. దీని టీజర్ కొన్ని నెలల క్రితం విడుదల కాగా.. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా పోస్టర్లు, టీజర్లు అయితే ఆకట్టుకునే విధంగా ఉంది. మరి ఈ సినిమా అయినా.. శర్వానంద్ కి హిట్ తీసుకొస్తుందేమో చూడాలి!