ఇదివరకంటే సినిమాలో కంటెంట్ యావరేజ్ గా ఉన్నా హీరో స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ బట్టి సినిమాలు ఆడేసేవి. అయితే.. ప్రస్తుతం ప్రేక్షకుడి అందుబాటులోకి ప్రపంచ సినిమా వచ్చేయడం, ఒకేవారంలో బోలెడన్ని ఆప్షన్స్ వస్తుండడంతో.. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా కనీస స్థాయి కంటెంట్ & ఎంటర్ టైన్మెంట్ లేకపోతే బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తాకొడుతున్నాయి. అందుకు నిదర్శనం సంక్రాంతికి విడుదలైన కొత్త సినిమాలే . అందుకే ఈమధ్యకాలంలో సీనియర్ హీరోలు మాత్రమే కాదు యంగ్ హీరోస్ కూడా కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
ఇక విషయానికి వస్తే.. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం సన్నబడే ప్రోసెస్ లో శర్వానంద్ ఆ సినిమా కంటే ముందు హను రాఘవపూడి చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతోపాటు “దండుపాళ్యం” ఫేమ్ శ్రీనివాసరాజు సినిమా కూడా ఓకే చేశాడనే వార్తలొచ్చాయి. కానీ.. శ్రీనివాసరాజు చెప్పిన స్టోరీలైన్ నచ్చింది కానీ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేవరకూ సినిమా సైన్ చేయనన్నాడట శర్వానంద్. దాంతో ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ పోయ్ అయ్యిందనే కథనాలు వెలువడ్డాయి. కానీ.. శ్రీనివాసరాజు త్వరలోనే బౌండెడ్ స్క్రిప్ట్ తో శర్వాను కలిసి ఫైనల్ డిస్కషన్స్ అనంతరం సినిమా ఎనౌన్స్ చేస్తానని చెబుతున్నాడు. చూద్దాం మరి ఎవరి సినిమా ఫైనల్ అవుతుందో.