Sharwanand: ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ బిజినెస్ అప్డేట్!

టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు శర్వా. ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక్క హిట్టు కూడా లేదు. ‘రణరంగం’, ‘జాను’, ‘మహాసముద్రం’ ఇలా అన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఈ ఫెయిల్యూర్స్ శర్వానంద్ మార్కెట్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా హిట్టు అనేది శర్వాకి చాలా ముఖ్యం. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

Click Here To Watch

శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రాధికా, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిషోర్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ​ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ షురూ చేశారు. సినిమా నుంచి పాటలు, టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అండ్ సాటిలైట్ రైట్స్ ను సోనీ గ్రూప్ సంస్థ దక్కించుకుందట. అంటే ఈ సినిమా సోనీ లివ్ లో ప్రసారమవుతుందన్నమాట. దీనికోసం సదరు సంస్థ ఏకంగా రూ.25 కోట్లకు చెల్లించినట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ రేంజ్ లో డీల్ వచ్చిందంటే విశేషమనే చెప్పాలి. శర్వా కెరీర్ లో ఇదే రికార్డ్ స్థాయి డీల్ అని చెప్పాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus