ఇప్పటివరకూ తెలుగు-తమిళ భాషల్లో కొన్ని వందల యాక్షన్ లేదా క్రైమ్ సినిమాలోచ్చాయి. కానీ.. మొట్టమొదటిసారిగా జనాల్ని భయపెట్టిన చిత్రం మాత్రం “దండుపాల్యం”. ఈ సినిమా రిలీజయ్యాక ఇంట్లో జనాలు వారి ఇళ్ళలో మహిళల రక్షణ గురించి భయపడేస్థాయికి వెళ్ళిపోయారు. కన్నడ సినిమా అయినప్పటికీ తెలుగులోనూ భారీ స్థాయిలో విజయాన్నందుకొంది. అంతే కాక దండుపాల్యం సిరీస్ లో రెండు సినిమాలు రావడానికి కూడా కారకురాలైంది. ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాసరాజుకి బోలెడంత పాపులారిటీ లభించింది. దాంతో కన్నడంలో బోలెడన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ.. తెలుగు దర్శకుడైన శ్రీనివాసరాజుకి తెలుగులో స్ట్రయిట్ సినిమాలు చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేది.
అందుకే మొదట్లో వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకుడితోపాటు కొందరు యువ హీరోలకి కూడా కథలు చెప్పాడు కానీ.. ఎవరూ శ్రీనివాసరాజు చెప్పిన కథలను ఎవరూ అప్పట్లో యాక్సెప్ట్ చేయలేదు. అయితే.. ఇన్నాళ్లకు శ్రీనివాసరాజు కథను ఒక యువ హీరో యాక్సెప్ట్ చేశాడు. అతడే శర్వానంద్. ఇటీవల శ్రీనివాసరాజు చెప్పిన కథ శర్వానంద్ కి విపరీతంగా నచ్చేసిందట. తానే స్వయంగా తనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కి చెప్పించాడట. వారికి కూడా కథ నచ్చడంతో శర్వా ప్రెజంట్ కమిట్ మెంట్స్ కంప్లీట్ అయినవెంటనే శ్రీనివాసారాజు ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది.