Sharwanand: అప్పుడు రాఖీ.. ఇప్పుడు విడాకులు..!
- August 13, 2024 / 08:42 PM ISTByFilmy Focus
టైటిల్ చూడగానే శర్వానంద్ (Sharwanand) పర్సనల్ లైఫ్ గురించి ఏవేవో ఆలోచించుకుని కంగారు పడకండి. విషయం పూర్తిగా వేరు. శర్వానంద్ ఈ మధ్యనే ‘మనమే’ (Manamey) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి…వాటిని మ్యాచ్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కూడా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఈ సినిమాపై శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) రేంజ్లో కాసుల వర్షం కురిపిస్తుంది అని ధీమాగా చెప్పాడు.
Sharwanand

కానీ అతను అనుకున్నది జరగలేదు. దీంతో అతని నెక్స్ట్ సినిమాల పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ‘లూజర్’ అనే హిట్టు వెబ్ సిరీస్ అందించిన అభిలాష్ రెడ్డితో ‘రేస్ రాజా’ అనే సినిమా చేశాడు. అలాగే ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తిగా విడాకుల కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు సమాచారం. కోర్టు డ్రామాగా ఆధ్యంతం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందట.

రామ్ అబ్బరాజు గత చిత్రం ‘సామజవరగమన’ లో ప్రేమించిన అమ్మాయి వరుసకు చెల్లి అవుతున్న తరుణంలో జరిగే కామెడీని చూపించాడు. అది బాగా పండింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు శర్వానంద్ తో విడాకుల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్టు సమాచారం. సంయుక్త మీనన్ (Samyuktha Menon) ,సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుండి త్వరలో ఫస్ట్ లుక్ రానుంది.
















