శర్వానంద్ తో సినిమా చేసే ఆలోచనలో త్రివిక్రమ్
- February 28, 2017 / 01:40 PM ISTByFilmy Focus
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత స్థాయి నుంచి డైరక్టర్ గా ఎదిగి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాతగానూ హిట్స్ సాధించడానికి అడుగులు వేస్తున్నారు. తొలి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ తో కలిసి నితిన్ సినిమాను నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది సెట్స్ మీద ఉండగానే త్రివిక్రమ్ మరో చిత్రాన్ని లైన్లో పెట్టే ఆలోచన చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ అనే మాట పక్కన పెట్టి, నూతన దర్శకులతో జట్టుకట్టి, కొత్త కథలతో విజయాలను తన బుట్టలో వేసుకుంటున్న శర్వానంద్ పై మాటల మాంత్రికుడి దృష్టి పడింది.
ఇతనితో సినిమా నిర్మిస్తే లాభాల పంట గ్యారంటీ అని నమ్ముతున్నారు. అందుకే నిర్మాతగా తన నెక్స్ట్ సినిమాకు శర్వానంద్ ని హీరోగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ యువ హీరో చంద్రమోహన్ డైరక్షన్ లో “రాధ” అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ చేయనున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ కి డైరక్టర్ ఎవరో .. త్వరలో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















