‘శ్రీకారం’ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ శర్వానంద్ కాదట..!

శ‌ర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహ‌న్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్ల‌స్‌’ బ్యాన‌ర్ ‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట కలిసి నిర్మించారు. ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘భలేగుంది బాల’ పాటకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.టీజర్ కూడా పర్వాలేదనిపించింది. కానీ ట్రైలర్ మాత్రం అంతగా ఇంపాక్ట్ ను క్రియేట్ చెయ్యలేకపోయింది.

దాంతో మార్చి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘శ్రీకారం’ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ శర్వానంద్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే ఇది శర్వానంద్ వద్దకు వచ్చిందట. వివరాల్లోకి వెళితే.. మొదట ‘శ్రీకారం’ చిత్రం కథని నేచురల్ స్టార్ నానికి వినిపించాడట దర్శకుడు కిషోర్. నానికి కూడా ఈ కథ బాగా నచ్చింది. అయితే అనూహ్యంగా మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో చాలా సీన్లు రిలేటెడ్ గా ఉన్నాయి.

చెప్పాలంటే దర్శకుడు కిశోర్ ‘శ్రీకారం’ అనే షార్ట్ ఫిలిం ను తెరకెక్కించాకే దానిని సినిమాగా మలచాలి అనుకున్నాడు. ఈ షార్ట్ ఫిలిం రిఫరెన్స్ తోనే ‘మహర్షి’ లో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. సో ఆల్రెడీ మహేష్ వంటి స్టార్ హీరో చేసేశాక.. నేను చేస్తే చూడరు అని భావించి నాని తప్పుకున్నాడు. అయితే దర్శకుడు ఇంకా బలమైన సన్నివేశాలను రాసుకుని హీరో శర్వానంద్ తో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus