శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రణరంగం’. పిడీవి ప్రసాద్ సమర్పణలో ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘స్వామి రారా’ దోచేయ్’ ‘కేశవ’ వంటి చిత్రాలని తెరకెక్కించిన సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. శర్వానంద్ ఈ చిత్రంలో యువకుడిగా రఫ్ లుక్ తోను .. మధ్య వయసు మాఫియా డాన్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాజల్ .. కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
‘పడి పడి లేచే మనసు’ వంటి డిజాస్టర్ తో డీలా పడిన శర్వానంద్ ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టందుకోవాలని ఎంతో కష్టపడి ఈ చిత్రం చేసాడు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా ‘యు/ఏ’ సర్టిఫికెట్ ను జారీ చేసారు సెన్సార్ బోర్డు సభ్యులు. ‘గ్యాంగ్ స్టర్’ అయిన హీరో (శర్వానంద్) జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’ కథాంశమట.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఉండగా. సెకండ్ హాఫ్ లో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. నిడివి కూడా తక్కువే ఉండడంతో ఏమాత్రం బోర్ అనే ఫీలింగ్ లేకుండా సినిమా సాగుతుందట. ప్రశాంత్ పిళ్ళై అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికే హైలెట్ అట. మొత్తానికి సెన్సార్ వాళ్ళైతే పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రం శర్వాకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.