Shruti Hassan: మహిళలు అందరికీ ఈ పాట అంకితం: శ్రుతి

శ్రుతి హాసన్‌ మల్టీటాలెంటెడ్‌ అనే విషయం మనకు తెలిసిందే. నటిగా మాత్రమే కాకుండా గాయనిగానూ తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె నుండి ఎలాంటి సింగిల్స్‌/సాంగ్స్‌ రాలేదు. కరోనా పరిస్థితుల వల్లనో, లేక ఇంకేం కారణమో కానీ.. ఆమె నుండి పాటలు అయితే రాలేదు. తాజాగా శ్రుతి హాసన్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ ఒకటి చేసింది. ‘షీ ఈజ్‌ హీరో’ అంటూ ఓ పాటను విడుదల చేసింది. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పుడు సంచలనంగా మారింది.

‘షీ ఈజ్‌ ఏ హీరో’ అంటూ సాగే గీతాన్ని ఎంసీ అల్తాఫ్‌తో కలసి శ్రుతి హాసన్‌ ఆలపించింది. నిత్య జీవితంలో సగటు మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఈ పాట సాగింది. ‘‘ఓ మహిళగా ప్రస్తుతం, గతం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటూనే ఉంటాను. మహిళలు అందరికీ ఈ పాటను అంకితమిస్తున్నాం. ఈ పాటకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పాట నచ్చితే నేను నటిస్తున్న సినిమాల్లోనూ పాట పాడతాను’’ అంటూ ఈ పాటను షేర్‌ చేస్తూ రాసుకొచ్చింది శ్రుతి.

కరణ్‌ కంచన్‌, కరణ్‌ పారిక్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని శ్రుతి హాసన్‌, ఎంసీ అల్తాఫ్‌ ఆలపించారు. ర్యాప్‌, ఎమోషనల్‌ సింగింగ్‌తో పాట అదిరిపోయింది అని చెప్పొచ్చు. బ్లాక్‌ అండ్‌ వైట్ కాంబినేషన్‌లో పాటను చిత్రీకరించిన విధానం బాగుంది. మహిళల సమస్యల్ని వివరించే విధానం బాగుంది. శ్రుతి, అల్తాఫ్‌ కలసి ఈ పాటను రచించారు. నిరంజన్‌ అయ్యంగర్‌ అందించిన అదనపు లిరిక్స్‌ కూడా భావోద్వేగాన్ని పెంచేలా ఉన్నాయని సంగీత ప్రియులు, మహిళల హక్కుల మీద ఉద్యమం చేస్తున్నవాళ్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

శిక్షా సేవా ఫౌండేషన్‌ ఈ వీడియోను రూపొందించింది. ఇక శ్రుతి సినిమాల సంగతి చూస్తే.. మూడు సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్‌ ‘సలార్‌’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ 107వ సినిమాలో శ్రుతి నటిస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని చెబుతున్నారు. వాటి విషయం త్వరలో తేలనుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus