‘శెహ్ జాదా’ గ్లింప్స్ చూసి షాక్ తింటున్న టాలీవుడ్ ప్రేక్షకులు..!

2020 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు పాన్ ఇండియా మూవీ కాకపోయినా.. రూ.250 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలకి నార్త్ లో సూపర్ క్రేజ్ ఉంది.

అందుకే ‘అల వైకుంఠపురములో’ డబ్బింగ్ రైట్స్ ను ఏకంగా రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతేకాదు ఆ తర్వాత రీమేక్ రైట్స్ ను కూడా రూ.8 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అక్కడ ఈ చిత్రాన్ని ‘శెహ్ జాదా’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రోహిత్ ధావన్ ఈ చిత్రానికి దర్శకుడు.

తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పేరుతో చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ కనుక చూస్తే.. ‘అల వైకుంఠపురములో’ ని మక్కీకి మక్కీ దింపేశారు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా హంగులు కూడా యాడ్ చేశారు అని స్పష్టమవుతుంది. అవి చూస్తే కనుక తెలుగు ప్రేక్షకులు ఇరిటేట్ అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. మన తెలుగు సినిమాలను బాలీవుడ్ మేకర్స్ రీమేక్ చేస్తే..

ఎంత హడావిడిగా ఉంటుందో ‘పరుగు’ ‘వర్షం’ ‘క్షణం’ వంటి హిందీ రీమేక్ లతో చూశాం. ఇది కాబట్టి.. ఇది రెండు విధాలుగా కూడా కొత్తగా అనిపించదు. ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని బాగా ప్రేమించే వారు మాత్రం ‘శెహ్ జాదా’ గ్లింప్స్ ను చూస్తే చెడగొట్టేశారు బాబోయ్ అని ఫీల్ అవ్వడం గ్యారంటీ. ఇక తెలుగులో టబు పోషించిన పాత్రని హిందీలో మనీషా కొయిరాలా చేసినట్టు భోగట్టా.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus