నిన్న ఇదే సమయానికి ప్రెజంట్ యూట్యూబ్ స్టార్ శ్రీరెడ్డి తనను ఒక దర్శకుడు వీడియో కాల్స్ కోసం వాడుకొనేవాడని, అవకాశాలిప్పిస్తానని మోసం చేశాడని శ్రీరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. పేరు సరిగ్గా చెప్పకపోయినా అది శేఖర్ కమ్ముల గురించే అని దాదాపుగా అందరికీ అర్ధమైంది. ఇప్పుడు ఈ విషయమై శేఖర్ కమ్ముల స్పందించాడు. ఈ క్రింది విధంగా పోస్ట్ చేశాడు శేఖర్ కమ్ముల. “నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది.
ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను” అని శేఖర్ కమ్ముల పేర్కొన్నాడు. మరి ఇప్పుడు శ్రీరెడ్డి ఈ కౌంటర్ కి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.