మనం అభిమానిస్తున్న వ్యక్తి చిన్న తప్పు చేసినా మనకి బాధ కలుగుతుంది. కోపం వస్తుంది. ఆ ఆగ్రహాన్ని ఏదో రూపంలో వ్యక్తపరుస్తుంటాం. అలా మనసులోని ఫీలింగ్స్ ని బయట పెట్టి ఇబ్బందుల్లో పడిన వారిలో కూల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఉన్నారు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించగానే ఆనందపడ్డారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు “జై పవన్” అంటూ కార్యకర్తలా నినదించారు. చివరకు పవన్ టీడీపీ, బిజెపి మద్దత్తు ఇవ్వడంతో బాధపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
“పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినపుడు చూపించిన పవర్ ఇప్పుడు ఏమైయిందని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శేఖర్ కమ్మల వివరణ ఇచ్చారు. ”నేను పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్. ఆయన గొప్ప లీడర్ అవుతాడని నమ్మాను. నాయకుడు ముందుండి ప్రజలను నడిపించాలి. వేరెవరో నాయకత్వంలో నడవమని చెప్పకూడదు. ఆయన వేరే వారికి మద్దతు ఇవ్వమని చెప్పడం నాకు వింతగా అనిపించింది. అలా అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆ భాదతోనే అప్పడు అలా కామెంట్స్ పెట్టా.’ అని వివరించారు.