టాలీవుడ్‌లో బ్రేకప్స్, విడాకుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో హీరో తన 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేశారు. నటుడు షిజు(Shiju) ఏఆర్ తన భార్య ప్రీతి ప్రేమ్‌తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చాడు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ‘దేవి’ సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఆ సినిమాలో హీరో ఇతనే. ఆ తర్వాత ‘త్రినేత్రం’ వంటి సినిమాలో కూడా హీరోగా నటించాడు.
ఇదిలా ఉండగా.. విడాకుల వ్యవహారం పై షిజు స్పందిస్తూ… “మేము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కోర్టు కూడా మాకు అఫీషియల్‌గా విడాకులు మంజూరు చేసింది. భార్యాభర్తలుగా మా బంధం ముగిసినా.. ఇకపై మంచి స్నేహితులుగా కొనసాగుతాం” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని, ఎలాంటి ఫేక్ రూమర్స్ క్రియేట్ చేయొద్దని తమ ఫాలోవర్స్ ని కోరారు.

షిజు దంపతులది ప్రేమ వివాహం. ఓ మలయాళ సినిమా చూసి ప్రీతి షిజుకి ఫ్యాన్‌గా మారారు. ఆ తర్వాత ఆమె ఎయిర్ హోస్టెస్‌గా ఉన్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. మతాలు వేరైనా (ముస్లిం-క్రిస్టియన్) ఇంట్లో పెద్దలను ఎదిరించి మరీ 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇంత గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట.. ఇప్పుడు సడెన్‌గా విడిపోవడం ఒక రకంగా బాధాకరం అనే చెప్పాలి.
షిజు ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ‘శతమానం భవతి’ ‘టాక్సీ వాలా’ ‘ఇద్దరి లోకం ఒకటే’ ‘గాడ్సే’ ‘హిడింబ’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2025లో వచ్చిన నితిన్ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో కూడా ఇతను ఓ చిన్న పాత్ర పోషించాడు.
