సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు 100 మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని వల్ల వచ్చిన మంచి పేరును పోగొట్టుకుంటూ ఉంటారు. అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నటిగా తనకంటూ శిల్పాశెట్టి మంచి పేరును సంపాదించుకోగా భర్త చేసిన పని వల్ల పరువు పోగొట్టుకున్నారు. ఇప్పటివరకు ఆమెను అభిమానించిన ఫ్యాన్స్ సైతం ఆమెను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రాజ్ కుంద్రా నిర్వహించిన అశ్లీల చిత్రాల వ్యవహారం గురించి శిల్పాశెట్టికి తెలియదు. విచారణ సమయంలో భర్తను చూసిన శిల్పాశెట్టి ఆవేశానికి లోను కావడంతో పాటు భర్తను కొట్టడానికి ప్రయత్నం చేశారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిందని సమాచారం. ఆ తర్వాత శిల్పాశెట్టి బోరున ఏడ్చారని తెలుస్తోంది. అలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరమేమిటని శిల్పాశెట్టి భర్తను ప్రశ్నించినట్టు సమాచారం.
అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతూనే శిల్పాశెట్టి కంటతడి పెట్టుకున్నారని తెలుస్తోంది. రాజ్ కుంద్రా వల్ల తన పేరుప్రతిష్టలకు భంగం కలిగిందని కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు క్యాన్సిల్ కావడం వల్ల ఆర్థికంగా నష్టపోయానని శిల్పాశెట్టి అధికారులకు వెల్లడించారు. మరోవైపు రాజ్ కుంద్రాకు తన అరెస్ట్ గురించి ముందే తెలుసని పోలీసులు అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు రాజ్ కుంద్రా దగ్గర సమాచారం ఉందని తెలుస్తోంది. రాజ్ కుంద్రా కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!