Shine Tom Chacko: నటుడు షైన్ టామ్ చాకోని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు!

‘దసరా’ (Dasara) ‘దేవర’ (Devara) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) అందరికీ సుపరిచితమే. రీసెంట్ గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమాతో కూడా అలరించాడు. తక్కువ టైంలోనే పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందిన ఇతను… వివాదంలో చిక్కుకుని.. అరెస్ట్ అయ్యాడు. ఇక తాజాగా షైన్ టామ్ చాకో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. కేరళ పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వాడకం, సరఫరా వంటి స్కాముల కారణంగా అతను అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది.

Shine Tom Chacko

NDPS సెక్షన్లు 27, 29 కింద‌ ఆయన పై కేసు నమోదైనట్లు నిన్న, మొన్నటి వరకు ప్రచారం జరిగింది. త్వరలో అతనికి మెడికల్ టెస్టులు కూడా నిర్వహించనున్నారు. కేరళలో ఉన్న ఎర్నాకుళం నార్త్ పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద సైన్ టైం చాకోని అరెస్ట్ చేశారట. కొచ్చిలో విచార‌ణ‌కు హాజ‌రైన షైన్ టామ్ చాకోని దాదాపు 4 గంటల పాటు విచారించారట. బుధవారం నాడే షైన్ టామ్ చాకోని పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు.

అయితే చాకో తన హోటల్ గది నుండి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఎస్కేప్ అయ్యాడట. పోలీసులు ఉన్నారని కూడా షైన్ టామ్ చాకో చూసుకోకుండా పారిపోయినట్టు.. వాళ్ళు తెలిపారు. అయితే ఎవరో దుండగులు తనపై దాడి చేయడానికి ప్రయత్నించారు అనుకుని తాను పారిపోయినట్టు షైన్ టామ్ చాకో చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఇతని కేసులో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus