పెళ్లి రోజున భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మధుమిత ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో మధుమిత, శివ బాలాజీ జంట కూడా ఒకటి. వీరిద్దరూ పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో 2009 మార్చి 1 వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం జరిగిన తర్వాత మధుమిత సినిమాలకు దూరమై ఇంటికి పరిమితం అయింది.

వివాహం జరిగిన సమయం నుండి ఇప్పటివరకు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా వీరి పెళ్లి రోజు సందర్భంగా మధుమిత చేసిన షేర్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధుమిత సినిమాలకు దూరమైనప్పటికీ అప్పుడప్పుడు టీవీ షోలలో సందడి చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మధుమిత షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ క్రమంలో మధుమిత ” నా జననం నేను ఎంచుకోలేదు, అలాగే నా మరణం కూడా నేను ఎన్నుకొలేను. కానీ అంతులేని ప్రేమతో నేను ఎన్నుకున్న మీరు అద్భుతమైన ప్రేమతో నా జీవితాన్ని అందంగా మలిచారు. ఈ విశ్వం నాకు ఇచ్చిన అతి గొప్ప వరం మీరు. మీరు నా శివ, నేను మీ మధు .సదా ప్రేమలో పద్నాలుగేళ్ల శివ – మధు పెళ్ళి రోజు శుభాకాంక్షలు ” అంటూ తన పట్ల తన భర్త చూపించే ప్రేమ ,అనురాగం గురించి తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వారికి పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా వీరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక వీరి వివాహం జరిగి 14 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ జంట తమ పెళ్లిరోజులు ఘనంగా జరుపుకొనున్నారు. ఇక ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం కలరు. ప్రస్తుతం మధుమిత షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus