శివ జ్యోతి పరిచయం అవసరం లేని పేరు. తీన్మార్ సావిత్రిగా అందరి మనసులు దోచుకుంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఈమె చెప్పే వార్తలు.. బిత్తిరి సత్తితో చెప్పే ముచ్చట్లకి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈమె ఫ్యాన్స్ అయిపోయారు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చింది. తన గేమ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. శివ జ్యోతి జీవితంలో ఎంత ట్రాజెడీ ఉందో ‘బిగ్ బాస్’ ద్వారా అందరికీ తెలిసొచ్చింది. హౌస్ లో ఎక్కువ సేపు పాతాళ గంగ మాదిరి ఏడుస్తూ ఉండడం కొంతమందిని విసిగించినప్పటికీ…. ఈమె మైండ్ గేమ్స్ అందరినీ ఆకట్టుకునేవి.
Shiva Jyothi
ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యాంకర్ గా పలు న్యూస్ ఛానల్స్ లో పనిచేసింది. అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని.. అందులో తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో చేసిన వీడియోలతో బాగా డబ్బులు సంపాదించింది. అలా సొంతింటి కల నెరవేర్చుకుంది. ఇక శివజ్యోతి గంగూలీ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె హౌస్ లో ఉన్నప్పుడు అతను కూడా హైలెట్ అయ్యాడు.
ఇదిలా ఉండగా.. శివ జ్యోతి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. తాజాగా ఆమె 5వ నెల సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా శివ జ్యోతి దంపతులకు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :