Shiva Rajkumar: ‘పెద్ది’ లో శివరాజ్ కుమార్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు!

‘గేమ్ ఛేంజర్'(Game changer) తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) …. ‘ఉప్పెన’ (Uppena)  ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు చరణ్ పుట్టినరోజు కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. వాస్తవానికి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కుదరలేదు.

Shiva Rajkumar

అన్నీ కుదిరితే ఉగాది పండుగ రోజు నాడు ‘పెద్ది’  (Peddi) గ్లింప్స్ వదిలే అవకాశం ఉందని నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ‘పెద్ది’ కి సంబంధించి ఒక షెడ్యూల్ నిర్వహించారు. చరణ్ లేని పార్ట్ కూడా చాలా వరకు షూట్ చేశారు. బూత్ బంగ్లాలో నిర్వహించిన షూటింగ్లో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar)  కూడా పాల్గొన్నారు. కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ రోల్ ఈ సినిమాలో చాలా బాగుంటుందట.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar).. రాంచరణ్ కి తండ్రి పాత్రలో కనిపిస్తారు అని తెలుస్తుంది. శివరాజ్ కుమార్ పాత్రకి మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని టాక్. ఇతని పాత్ర ఆధారంగానే హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందని అంటున్నారు. రాంచరణ్ ఈ సినిమాలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ .. ఈ 3 ఆటల్లోనూ ప్రావిణ్యం పొందిన ఆటగాడిగా కనిపిస్తాడని అంటున్నారు. 2026 మార్చి 26 రిలీజ్ డేట్ టార్గెట్ గా బుచ్చిబాబు.. షూటింగ్ జరుపుతున్నట్టు టాక్.

ఇది ఫేక్‌ కాదు.. ఏఐ కూడా కాదు.. విరాట్‌ కోహ్లీ కూడా కాదు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus