ఇది ఫేక్‌ కాదు.. ఏఐ కూడా కాదు.. విరాట్‌ కోహ్లీ కూడా కాదు..!

మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అని చెబుతుంటారు మన పెద్దలు. అయితే అందరి సంగతి తెలియదు కానీ.. సెలబ్రిటీల పోలిన వ్యక్తుల గురించి అయితే వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే సెలబ్రిటీని పోలిన వ్యక్తి కూడా సెలబ్రిటీ అయితే ఈ విషయం ఆశ్చర్యం కలిగించేదే. టీమిండియా ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని (Virat Kohli) పోలిన వ్యక్తి అంటూ కొన్ని ఫొటోలు చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఓ నటుడు కోహ్లీ లానే ఉన్నాడు.

Virat Kohli

విరాట్ కోహ్లీలానే (Virat Kohli) ఉన్నాడు చూడండి అంటూ గత రెండ్రోజులుగా ఓ సినిమాలోని స్క్రీన్‌షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టర్కీకి చెందిన ప్రముఖ నటుడు కావిట్ సెటిన్ గునెర్ ఆ ఫొటోలో ఉన్నాడు. ఒక టీవీ సీరీస్‌లోని సన్నివేశానికి సంబంధించి స్క్రీన్‌ షాట్‌ ఇది. ఈ క్రమంలో కొందరు ‘టీవీ సీరీస్‌లో అందులోనూ టర్కీ టీవీ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఎలా?’ అని కొంతమంది ఆ ఫొటోల కింద కామెంట్స్‌ చేస్తున్నారు.

నిజానికి ఈ చర్చ రెడిట్‌లో మొదలైంది. ‘అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం చేశాడు’ అని ఓ నెటిజన్‌ కావిట్ సెటిన్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. కోహ్లీని తలపించే కళ్లు, గడ్డం, ముఖ ఆకృతి, హెయిర్‌స్టైల్‌ చూసి కొంతమంది నిజమే అనుకున్నారు. అయితే ఆ వ్యక్తి కోహ్లీ కాదు, టర్కీ కోహ్లీ (Virat Kohli) అని ఆ ఫొటో కింద కామెంట్‌ కనిపించింది. దీంతో ఇది నిజమేనా కావిట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే.. కొన్ని యాంగిల్స్‌లో అతను విరాట్‌లానే ఉన్నాడు.

ఆ ఫోటో ‘డిర్లిస్‌: ఎర్టుగ్రుల్‌’ అనే టర్కీ హిస్టారికల్ డ్రామా సిరీస్‌కి సంబంధించినది. 2014లో నుండి 2019 వరకు ఐదు సీజన్లుగా ఈ సిరీస్‌ ప్రసారం అయింది. మీరూ ఈ సిరీస్‌ చూడాలి అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఏదైనా ఇద్దరు సెలబ్రిటీలు దాదాపు ఒకేలా ఉండటం ఆసక్తికరమే కదా.

ఏది ఏమైనా అట్లీ ఇక ఆ సినిమా చేయాల్సిందే? వేరే ఆప్షన్‌ లేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus