36 ఏళ్ళ క్రితం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరో గా , అమల హీరోయిన్ గా రూపొందిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ “శివ”. ఈ సినిమాలో రఘు వరెన్ విలన్ పాత్రలో జీవించగా , తనికెళ్ళ భరణి , జె డీ చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ అప్పట్లో ఒక సంచలనం. కేవలం 75 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు 10 కోట్ల కలెక్షన్ సాధించింది అంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్ధం అవుతుంది. అప్పటి టికెట్ ధరలకి అంత కలెక్ట్ చేయటం అంటే మాములు విషయం కాదు.
అయితే ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ శివ మూవీ ని 4k dolby atmos తో రీ రికార్డింగ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గత కొన్ని నెలలుగా చాలా ఇష్టంతో ఈ మూవీ రీ డిఫైనింగ్ వర్క్ అంతా దగ్గరుండి చూసుకున్నాడు. ఇన్నాళ్ళకి ఈ కల్ట్ క్లాసిక్ మల్లి రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రీ రిలీజ్ డే (నవంబర్14) రానే వచ్చింది.

అక్కినేని అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తానే స్వయంగా హైదరాబాద్ లో మూవీ లవర్స్ కి ఫేమస్ అయిన RTC X రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో సందడి చేస్తూ కనిపించాడు. దీంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 4k టెక్నాలజీ వెర్షన్ మంచి కిక్ ఇచ్చింది అంటున్నారు ప్రేక్షకులు..!
