Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పేసిన శివాజీ రాజా!

ఈ నెల 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనుండగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు భవనం లేదనే విషయంలో స్టార్ హీరోల తప్పు అస్సలు లేదని శివాజీరాజా పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎవరి సమస్యలు వారికి ఉంటాయని ఎవరైనా వెళ్లి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ కావాలని అడిగితే స్టార్ హీరోలు ముందుకొస్తారని శివాజీరాజా చెప్పుకొచ్చారు.

అమెరికాలో ఈవెంట్ చేద్దామంటే చిరంజీవి గారు ముందుకొచ్చారని మహేష్ గారిని ఈవెంట్ గురించి కలవగా మహేష్ బాబు, నమ్రత ఎంతో గౌరవంగా మీ ఇష్టం సార్ మీరు ఎలా చెబితే అలా చేద్దామని అన్నారని శివాజీరాజా వెల్లడించారు. తాను, బెనర్జీ ప్రభాస్ దగ్గరకు వెళ్లగా ప్రోగ్రామ్ చేయడం వల్ల ఎంత వస్తుందో చెప్పాలని అడిగారని తాను అమౌంట్ చెప్పగా తాను బిజీగా ఉన్నానని అయితే ఆ అమౌంట్ ను తాను ఇస్తానని ప్రభాస్ చెప్పారని శివాజీరాజా ప్రభాస్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ లో మంచి హృదయం ఉన్న హీరోలు ఎంతోమంది ఉన్నారని స్టార్ హీరోలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం డబ్బులు ఇవ్వడం లేదని చెప్పడం నూటికి నూరు శాతం తప్పు అని శివాజీరాజా చెప్పుకొచ్చారు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus