Sivaji: నామినేషన్స్ లో ఏం జరిగింది..? ఎవరెవరు నామినేట్ అయ్యారంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం నామినేషన్స్ ఒక రేంజ్ లో జరిగాయి. హౌస్ మేట్స్ దగ్గర ఉన్న స్టాండ్ పై ఒక కుండని పెట్టి దాన్ని బేస్ బాల్ బ్యాట్ తో కొట్టి మరీ నామినేట్ చేయాలి. ఈ ప్రోసెస్ ప్రతి సీజన్ లో ఉండేదే. అయితే, ఈసారి నామినేషన్స్ శివాజీ ఎలిమినేషన్ తో స్టార్ట్ అయ్యింది. ఆరోగ్య రీత్యా శివాజీని కన్ఫెషన్ రూమ్ నుంచీ నేరుగా మెడికల్ చెకప్ కోసం మైయిన్ గేట్ తీసి మరీ తీస్కుని వెళ్లాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ ఖంగారు పడిపోయారు.

శివాజీ ఏమీ చెప్పకుండా అందరికీ బైబై చెప్పి వెళ్లేసరికి ప్రశాంత్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అమర్ ప్రశాంత్ ని ఓదార్చాడు అలాగే, శోభా , సందీప్, పూజ ఇలా అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రియాంక అయితే శివాజీని కదలనివ్వకుండా పట్టుకుంది. ఇక శివాజీ బయటకి వచ్చిన తర్వాత మెడికల్ చెకప్ చేయించుకుని మళ్లీ తిరిగి హౌస్ లోకి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, శివాజీ నామినేషన్స్ లో మాత్రం లేడు.

నామినేషన్ ప్రక్రియ అనేది శివాజీ లేకుండానే హౌస్ మేట్స్ చేశారు. ఇందులో కెప్టెన్ ప్రిన్స్ యావర్ కాబట్టి యావర్ ని ఎవరు కూడా నామినేట్ చేయలేదు. ఈ నామినేషన్స్ లో భోళే షవాలి, ఇంకా శోభాశెట్టి ఒక రేంజ్ లో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, భోళెకి అందరికంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో భోళే షవాలి అందరితోనూ ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నాడు. అలాగే, అశ్వినిని కూడా టార్గెట్ చేశారు హౌస్ మేట్స్. ఎలిమినేషన్ వరకూ వెళ్లి వచ్చిన అశ్విని చాలా స్ట్రాంగ్ గా కౌంటర్స్ ఇచ్చింది.

మొత్తానికి కుండ బద్దలు కొట్టి మరీ హౌస్ మేట్స్ గొడవ పడ్డారు. ఈవారం ఫైనల్ గా తొమ్మిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. వాళ్లలో భోళే షవాలి, అశ్విని, గౌతమ్, అమర్, పూజ, తేజ, శోభా, పల్లవి ప్రశాంత్, ఇంకా అర్జున్ అంబటి ఉన్నారు. దీంతో ఈవారం కూడా సందీప్ నామినేషన్స్ లోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. అలాగే ప్రియాంకని కూడా ఎవ్వరూ నామినేట్ చేయలేదు. కెప్టెన్ యావర్ కి స్పెషల్ పవర్ ఇచ్చారో లేదో చూడాలి. ఈవారం నామినేషన్స్ చాలా రసవత్తరంగా అయితే జరిగాయనే చెప్పాలి. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus