Shivathmika Rajashekar: హాట్ టాపిక్ గా మారిన శివాత్మిక గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

శివాత్మిక రాజశేఖర్ అందరికీ సుపరిచితమే. జీవిత రాజశేఖర్ ల కుమార్తెగా సినిమాల్లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమా ‘దొరసాని’ తో ప్రామిసింగ్ యాక్ట్రెస్ అనిపించుకుంది. అటు తర్వాత రెండు తమిళ సినిమాల్లో నటించింది. అలాగే ‘పంచతంత్రం’ ‘రంగమార్తాండ’ వంటి క్రేజీ సినిమాల్లో నటించి మెప్పించింది. ‘రంగమార్తాండ’ సినిమాలో ఈమె ప్రకాష్ రాజ్ కుమార్తెగా కనిపించింది. కొంచెం గ్రే షేడ్స్ కలిగిన పాత్ర అయినప్పటికీ.. చాలా బాగా నటించింది అని చెప్పాలి.

శివాత్మిక (Shivathmika) పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ .. ఆ ఇన్ఫ్లుయెన్స్ ను ఆమె వాడుకోవాలని ప్రయత్నించడం లేదు. సొంతంగా ఎదగాలని ఆమె ప్రయత్నిస్తుంది. అందుకోసం గ్లామర్ షో చేయడానికి కూడా ఆమె వెనుకాడను అని తరచూ పలు గ్లామర్ ఫోటోల ద్వారా చెబుతూనే ఉంది. శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి… ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇటీవల శివాత్మిక సైమా అవార్డుల వేడుక కోసం దుబాయ్ వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. ఇక సైమా అవార్డుల వేడుకలో ఈమె డ్రెస్సింగ్ చూసి అంతా స్టన్ అయిపోయారు అనే చెప్పాలి. ఇక లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus