Shobana,Rajinikanth: రజనీకాంత్‌ సినిమాలో టేబుల్ కవర్‌ కట్టిన హీరోయిన్‌.. ఎందుకంటే?

రెయిన్‌ సాంగ్స్‌లో హీరోయిన్స్‌ను చూడటానికి ఫ్యాన్స్‌ చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు. తడి దుస్తుల్లో నాయికల అందాలు చూస్తుంటే కుర్రాళ్ల గుండెల్లో తడి ఆరిపోతుంది అని చెప్పొచ్చు. అందులోనూ అప్పటివరకు స్కిన్‌ షో, ఎక్స్‌పోజింగ్‌ చేయని హీరోయిన్ల విషయంలో అయితే ఆ క్యూరియాసిటీ ఇంకా ఉంటుంది. అలాంటి వారిలో గత తరం హీరోయిన్‌ శోభన ఒకరు. పద్ధతైన, పొందికైన పాత్రలతో అలరించిన శోభన.. ఓ వాన పాటలో నటించారు కూడా. అయితే ఆ పాటకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అంటూ ఇలా దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు శోభన. స్టార్‌ హీరోలతో ఆమెకు మంచి విజయాలు ఉన్నాయి. అయితే ఎక్కడా ఆమె శ్రుతి మించిన అందాల ప్రదర్శన అయితే ఎక్కడా లేదు. కానీ రజనీకాంత్‌తో ఓ సినిమాలో వాన పాటలో డ్యాన్స్‌ చేశారు. తమిళంలో తెరకెక్కిన ‘శివ’ సినిమా వాన పాట షూట్‌లో జరిగిన ఆసక్తికర విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెయిన్‌ సాంగ్స్‌ అంటే హీరోయిన్స్‌ను మర్డర్‌ చేసినట్టే.. అని కామెంట్‌ చేశారు.

‘శివ’, ‘దళపతి’ సినిమాల్లో రజనీకాంత్‌, శోభన కలసి నటించారు. ‘శివ’ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు రజనీకాంత్‌ ఆమెకు ఎంతగానో సాయం చేశారట. ఇద్దరిపై వర్షం పాట చిత్రీకరించడానికి సెట్‌ వేశారు. సెట్స్‌లో అందరికీ అది వాన పాట అని తెలుసు. అయితే ఆమెకు ముందు ఎవరూ చెప్పలేదు. శరీరం కనిపించేలా ఉన్న ఓ తెల్ల చీర ఇచ్చి కట్టుకోమన్నారట. ఆ కాస్ట్యూమ్‌ చూడగానే రెయిన్‌సాంగ్‌ అని అర్థమైందట ఆమెకు. దీంతో కాస్ట్యూమ్‌ బాయ్‌ని పిలిచి ‘ఈ చీర పల్చగా ఉంది.

ఇంటికి వెళ్లి శరీరం కనిపించకుండా ఉండేందుకు ఏదైనా కట్టుకుని వస్తా అని చెప్పిందట శోభన. అయితే షూటింగ్‌ మొదలు కావడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదట. దీంతో అక్కడే ఉన్న ఓ టేబుల్‌ కవర్‌ని ఒంటికి చుట్టుకుని.. దానిపై చీర కట్టుకుని పాటకు డ్యాన్స్‌ చేశారట శోభన. అయితే డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు కవర్‌ వల్ల సౌండ్‌ వచ్చి రజనీకాంత్‌ ఇబ్బందిపడ్డారు. కానీ, ఆయన ఏమీ అనలేదట. రెయిన్‌ సాంగ్స్‌ అంటే హీరోయిన్స్‌ను మర్డర్‌ చేసినట్టే. ఎందుకంటే చివరివరకూ వాళ్లకా విషయం తెలియదు అంటూ నవ్వేశారు శోభన.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus