విజయద్ర ప్రసాద్ రాసిన కథ వెండితెరపై కనిపించడానికి ప్రధాన కారణం నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. వారిద్దరూ భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొచ్చారు కాబట్టే తెలుగు ప్రజలందరూ గర్వించేలా రాజమౌళి బాహుబలి చిత్రాలను తెరకెక్కించారు. మహిష్మతి రాజ్యానికి సంబంధించిన కథ రెండు భాగాలుగా వచ్చినా.. అభిమానులకు సంతృప్తి కలగడం లేదు. మరో పార్ట్ వస్తే చూడాలని ఆశ పడుతున్నారు. వారి ఆశ తీరేటట్లు కనిపిస్తోంది. కథ ఇస్తే తీయడానికి నేను సిద్దమే అంటూ.. రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. రాజమౌళి తీస్తే నటించడానికి నేను రెడీ అంటూ ప్రభాస్ స్పష్టం చేశారు.
ఈ రెండింటితో పాటు తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ బాహుబలి పార్ట్ 3 వస్తుందనే నమ్మకాన్ని బలపరుస్తోంది. “ఒకసారి జరిగింది రెండో సారి జరగదు. కానీ రెండు సార్లు జరిగింది మూడో సారి ఖచ్చితంగా జరుగుతుంది” అంటూ ఓ ఆంగ్ల రచయిత రాసిన కొటేషన్ ని పోస్ట్ చేశారు. అంటే రెండు సార్లు వచ్చిన బాహుబలి.. మూడో సారి అలరిస్తుందని అర్ధం వచ్చేలా ఈ ట్వీట్ ఉంది. దీంతో బాహుబలి, ప్రభాస్ అభిమానులు ఆనందపడుతున్నారు. ఇండైరెక్ట్ గా కాకుండా డైరక్ట్ బాహుబలి 3 ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
Everything that happens once can never happen again. But everything that happens twice will surely happen a third time! From”The Alchemist”