సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం రేపు విడుదల క్యాన్సిల్ అయ్యింది. అంతేకాదు ఏప్రిల్ 15 వరకూ ఈ చిత్రాన్ని విడుదలచేయకూడదని…. సినిమా థియేటర్లలోనే కాకుండా సోషల్ మీడియా అయిన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర మీడియాల్లో కూడా సినిమాను ప్రదర్శించకూడదని ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.
ఈ చిత్రంలో టీడిపి నేత, ఏపీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ను విమర్శిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిందని నిర్దేశిస్తూ ఈ చిత్ర విడుదలకి బ్రేకులు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నికలు జరుగుతున్నఈ సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలైతే టీడీపీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ… పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు టిడీపి నేతలు. వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15 వరకూ సినిమాను నిలిపివేయాలని స్టే ఇచ్చింది. ఈ రకంగా ‘టిడీపి… ఆర్జీవీ కి వెన్నుపోటు పొడిచిందని’ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతూ కామెంట్ చేస్తున్నారు.