ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమా నుంచి పుష్ప ది రైజ్ వరకు ఎన్నో విజయాలను అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో బన్నీ ఒకరు కాగా పుష్ప ది రైజ్ సినిమాతో బన్నీకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. తగ్గేదేలే మేనరిజమ్ తో బన్నీ అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. పుష్ప1 రెండు భాగాలుగా తెరకెక్కడం వల్ల ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ అయిందని సుకుమార్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.
అయితే బన్నీ పుష్ప మేనరిజమ్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పరుగు మూవీలో కూడా ఉంది. బన్నీకి రియల్ లైఫ్ లో కూడా చేతిని అలా పెట్టి మాట్లాడే అలవాటు ఉంది. పుష్ప ది రైజ్ సమయంలో బన్నీకి ఉన్న అలవాటును గమనించిన సుకుమార్ ఆ మేనరిజమ్ కు తగ్గేదేలే అనే డైలాగ్ ను యాడ్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప మేనరిజమ్ కు మాత్రం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే.
పుష్ప2 ప్రమోషన్స్ ను కూడా తెలివిగా ప్లాన్ చేశారని సినిమా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగేలా మేకర్స్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమాలో మరికొన్ని కొత్త పాత్రలు కనిపించనున్నాయని సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాల్లో బాహుబలి2 ను ఫాలో కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
2024 సంవత్సరంలో క్రేజీ సినిమాలు విడుదలకానుండగా (Pushpa) పుష్ప2 సినిమా 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. 2024 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించడంతో పాటు ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.