ఏం జరుగుతోంది… నమ్రతా మేడమ్‌

అగ్ర కథానాయకులు, కథానాయికలు యాడ్స్‌ చేయడం కొత్త విషయమేమీ కాదు. అందులోనూ ఇద్దరు అగ్ర నటులు కలసి ఓ యాడ్‌ కోసం పని చేయడం కూడా కొత్త కాదు. కానీ రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న ప్రచారం చూస్తుంటే… ఆశ్చర్యమేస్తోంది. కారణంగా ఇద్దరు అగ్రనటులు కలసి ఓ యాడ్‌ చేస్తున్నారని, దానికి యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారనేది ఆ ప్రచారం సారాంశం. ఆ నటుటు మహేష్‌బాబు, తమన్నా అయితే.. ఆ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.

మహేష్‌బాబు, తమన్నా కలసి ఓ హోం అప్లియెన్సెస్‌ సంస్థకు యాడ్‌ చేశారు. తొలి రోజు ఏదో యాడ్‌లో నటిస్తున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అది ఇదే అంటూ సంస్థ పేరు వచ్చింది. ఇక్కడిదాకా ఓకే. కానీ ఆ యాడ్‌ ఏదో పెద్ద సినిమా లాగా… యాడ్‌ ఫొటోలను రిలీజ్‌ చేసి హంగామా చేస్తున్నారు. మహేష్‌, తమన్నా కాంబో ఇంట్రెస్టింగ్‌ పాయింటే అవ్వొచ్చు. కానీ యాడ్‌లో చూస్తే వచ్చే ఫీలింగ్‌ని ఫొటోలతో కిల్‌ చేసేస్తున్నరని టీమ్‌కి తెలియడం లేదా? మరి హెడ్డింగ్‌లో నమత్రా అన్నారేంటి అనుకుంటున్నారా… మహేష్‌ సోషల్‌ మీడియా వ్యవహారాలు చూసేది ఆమెనే అని అందరూ అంటుంటారు కాబట్టి.

ఒకప్పుడు యాడ్‌ షూటింగ్‌ చేశారని తెలిసి… ఆ యాడ్‌ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూసేవారు. కొన్నాళ్ల వెయిటింగ్‌ తర్వాత ఆ యాడ్‌ను చూసి అభిమానులు వావ్‌ అనుకునేవారు. కానీ ఇలా యాడ్‌ను ఓ సినిమాలా ఆన్‌సెట్స్‌ స్టిల్స్‌ రిలీజ్‌ చేసి… సినిమా స్టయిల్‌ ఎలివేషన్‌ ఇస్తున్నారు. వాళ్ల స్టయిల్‌లోనే మనమూ మాట్లాడాలంటే… ఇది మహేష్‌, తమన్నాకు హ్యాట్రిక్‌ అవుతుంది. ‘ఆగడు’, ‘సరిలేకు నీకెవ్వరు’ తర్వాత ఇద్దరూ కలసి నటించిన చిత్రం (ప్రచార చిత్రం) ఇదే కదా.


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus