Nagarjuna: నాగ్ సినిమాలు ఫ్లాప్ కావడానికి రీజన్ ఇదేనా?

స్టార్ హీరో నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగార్జున నటన వల్లే ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది. అయితే బంగార్రాజు సినిమాకు ముందు తర్వాత నాగార్జునకు వరుస షాకులు తగులుతున్నాయి. ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జునకు ఈ సినిమా ఫలితం భారీ షాకివ్వడం గమనార్హం. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా తొలిరోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఈ సినిమా తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తోంది.

కథల ఎంపికలో పొరపాట్లే నాగ్ వరుస ఫ్లాపులకు కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ తరహా పాత్రలు నాగార్జునకు సూట్ కావని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహా పాత్రలు నాగ్ కెరీర్ కు మైనస్ అవుతున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ప్రయోగాలు చేసే విషయంలో స్టార్ హీరో నాగార్జున ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే ఆ ప్రయోగాలు ఈ మధ్య కాలంలో వరుసగా ఫెయిల్ అవుతూ నాగార్జునతో సినిమా నిర్మించాలంటే నిర్మాతలు కూడా భయపడే పరిస్థితులకు కారణమవుతున్నాయి. మరోవైపు నాగార్జున సైతం రెమ్యునరేషన్ కు బదులుగా ఏరియాల హక్కులను తీసుకుంటున్నారు. ది ఘోస్ట్ సినిమా వల్ల నాగార్జునకు వచ్చే ఆదాయం కంటే ఆయన కోల్పోయే ఆదాయం ఎక్కువగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హిందీలో నాగార్జున ది ఘోస్ట్ సినిమాను సొంతంగా విడుదల చేయగా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు. నాగార్జునకు సోలో హీరోగా సక్సెస్ లు దక్కకపోవడంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. కెరీర్ విషయంలో నాగ్ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. నాగ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus