Salaar: సలార్ మూవీ టీజర్ పై మేకర్స్ క్లారిటీ ఇదే!

ఏడాది క్రితమే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమా షూటింగ్ మొదలైందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తి కాగా ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ప్రభాస్ ను గతంలో ఏ డైరెక్టర్ చూపించని విధంగా ప్రశాంత్ నీల్ చూపించనున్నారని యాక్షన్ సన్నివేశాలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

అయితే సలార్ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్2 సినిమా రిలీజ్ సమయంలోనే సలార్ టీజర్ గురించి జోరుగా ప్రచారం జరగగా మే నెల చివరి వారంలో ఈ సినిమా టీజర్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా నిర్మాత ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ సలార్ టీజర్ ను ఇప్పుడే విడుదల చేయడం లేదని ఈ టీజర్ రిలీజ్ ఆలస్యమవుతుందని వెల్లడించారు.

టీజర్ రిలీజ్ ఆలస్యమవుతుందని ఆయన చేసిన కామెంట్లు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి. ప్రభాస్ సినిమాలు వరుసగా షూటింగ్ లు జరుపుకుంటున్నా ఆ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు రావడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశకు గురవుతున్నారు. సలార్ సినిమా టీజర్ ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది. సలార్ టీజర్ విడుదలైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా ఆమె పాత్రకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. సలార్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా టీజర్ విడుదలైతే మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశాలు అయితే ఉంటాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus