Samantha: సమంతకి బిజినెస్ తెలివితేటలు పెరిగిపోయాయట..!

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత క్రేజ్ మరింత పెరిగిపోయిందని అంతా అనుకుంటున్నారు. బాలీవుడ్ తో పాటు ఏకంగా హాలీవుడ్లో కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని.. ఎన్నో అవార్డులు కూడా వస్తున్నాయనే వార్తలు చాలా వచ్చాయి. ‘ఫ్యామిలీ మెన్’ అనే వెబ్ సిరీస్ మరియు ‘పుష్ప’ లో ‘ఉ అంటావా ఉఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ తో ఈమెకి గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ లభించింది అనేది ఎక్కువగా ప్రచారమవుతుంది.

Click Here To Watch Now

నిజంగా ఓటిటి సంస్కృతి ఊపందుకున్నాక హాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా పోయింది. డబ్ కాకపోయినా పరభాషల సినిమాలు, సిరీస్ లను ప్రేక్షకులు వీక్షిస్తూ.. అందులో నటించిన నటీనటులను గుర్తుపెట్టుకుని వారి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్న మాట వాస్తవమే..! అలియా భట్, ధనుష్ లకు కూడా ఇది బాగా కలిసొచ్చింది. అలాగే సమంతకి కూడా కలిసొచ్చింది అని చాల మంది నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ ఈ విషయం పై సంతోషం వ్యక్తం చేసి మరీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇందులో పూర్తిగా నిజం లేదు అనేది ఇన్సైడ్ టాక్. సమంత తన టీం ద్వారా హాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతల్ని అప్రోచ్ అయ్యి.. ఇంకా వాళ్ళు ఫైనల్ చేయకుండానే, సమంత డెసిషన్ కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రచారం చేసుకుంటుందట. తద్వారా ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. దాంతో యాడ్స్, బ్రాండ్స్ కూడా పెరుగుతాయి. వాటికి రెవెన్యూ కూడా అదనంగా అందుతుంది. ఈమె ఫాలోయింగ్ చూసి హాలీవుడ్ మేకర్స్ కానీ బాలీవుడ్ మేకర్స్ కానీ పెండింగ్లో ఉన్న ఆఫర్లకి ఓకె చెప్పేస్తారు.

అది సమంత స్ట్రాటజీగా తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ ‘యశోద’ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus