Rajendra Prasad: ఆ హీరోలను టార్చర్ పెడుతున్న నటకిరీటి..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్2 సినిమాలోని క్యారెక్టర్లతో ఎఫ్3 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఎఫ్3 సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పిసినారిగా కనిపించనున్నారని రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్రను పోలి ఉంటుందని తెలుస్తోంది.

సినిమాలో వెంకటేష్, వరుణ్ లను రాజేంద్ర ప్రసాద్ పెట్టే టార్చర్ మామూలుగా ఉండదని సమాచారం. ఆగష్టు 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలతో సైతం కామెడీ చేయించి అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. ఎఫ్2 సినిమాలో నటించిన తమన్నా, మెహ్రీన్ ఎఫ్3 సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమా కథ ప్రధానంగా డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత సారథి స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఎఫ్2 సినిమాతో నిర్మాత దిల్ రాజుకు భారీగా లాభాలను అందించిన అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాతో సినిమా రిలీజ్ కు ముందే లాభాలను అందిస్తున్నారు. ఎఫ్2 సినిమా వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లో కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్ హిట్ కావడం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus