RRR, KGF2: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2.. ఏ మూవీ హిస్టరీ క్రియేట్ చేస్తుందో?

ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా కేజీఎఫ్2 సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ఆర్ మార్చి నెల 25వ తేదీన రిలీజ్ కానుండగా కేజీఎఫ్2 సినిమా ఏప్రిల్ నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ్ హీరోలుగా నటించగా కేజీఎఫ్2 సినిమాలో యశ్ హీరోగా నటించారు.

Click Here To Watch

ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు, విదేశాలలో నివశించే ప్రేక్షకులు సైతం ఈ సినిమాల కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. అయితే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల మధ్య ఊహించని పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా చరిత్ర సృష్టిస్తుందో ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్లను సాధిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. మొదట ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండటంతో ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయాల్సిన బాధ్యత కేజీఎఫ్2 సినిమాపై ఉంది.

హిందీలో కూడా ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు దేశవిదేశాల్లో మన దేశ సినిమాల ఖ్యాతిని పెంచే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్ ఛాప్టర్1తో యశ్ కు ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, చరణ్ పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అయితే కథ విషయంలో మాత్రం అటు ఆర్ఆర్ఆర్ కు, ఇటు కేజీఎఫ్ ఛాప్టర్1 కు ఎటువంటి పోలికలు లేకపోవడం గమనార్హం. బడ్జెట్ విషయంలో మాత్రం కేజీఎఫ్2 సినిమాతో పోల్చి చూస్తే ఆర్ఆర్ఆర్ మూవీ పై చేయి సాధిస్తోంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus