Actress Rambha: రంభ విడాకుల విషయంలో అసలు ట్విస్ట్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఒక వెలుగు వెలిగి యువత హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో రంభ ఒకరు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రంభ తొలి సినిమాతోనే ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. ఈమె స్వస్థలం విజయవాడ కావడం గమనార్హం. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన తర్వాత పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసిన రంభ ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు.

రంభ మళ్లీ వరుస సినిమా ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 2010 సంవత్సరంలో రంభ ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకున్నారు. రంభ ఇంద్రకుమార్ లకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. పెళ్లి తర్వాత రంభ ఇంద్రకుమార్ కొంతకాలం అన్యోన్యంగా జీవనం సాగించినా ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఒక దశలో మనస్పర్ధలు ఎక్కువ కావడంతో రంభ ఇంద్రకుమార్ విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవనం సాగించాలని భావించారు.

ఆ తర్వాత విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో రంభ ఇంద్రకుమార్ దరఖాస్తు చేసుకున్నారు. రంభ తన పిటిషన్ లో భారీ మొత్తంలో భరణంగా కావాలని డిమాండ్ చేశారని బోగట్టా. అయితే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు రంభ విడాకుల విషయం తెలిసి రంభతో మాట్లాడి భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించారని సమాచారం. రాఘవేంద్రరావుపై ఉన్న గౌరవంతో రంభ కూడా విడాకుల విషయంలో వెనక్కు తగ్గారు.

భర్తతో విడిపోతే సమాజంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి రాఘవేంద్రరావు రంభకు వివరించారని సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలని సూచనలు చేశారని సమాచారం. ఆ తర్వాత రంభ ఇంద్రకుమార్ చిన్నచిన్న సమస్యలు వచ్చినా తమలో తాము పరిష్కరించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతుండటం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus