Allu Arjun: బన్నీ చదువు గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

అల్లు శిరీష్ హీరోగా రాకేశ్ శశి డైరెక్షన్ లో తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోకు హాజరైన శిరీష్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. డబ్బు విషయంలో ఇంట్లో అందరం జాగ్రత్తగా మెలుగుతామని శిరీష్ పేర్కొన్నారు. ఊర్వశివో రాక్షసివో కథ నాన్నకు బాగా నచ్చి చేయించిన మూవీ అని అల్లు శిరీష్ పేర్కొన్నారు.

మంచి కథ దొరకడానికి టైమ్ పట్టిందని అందుకే ఈ సినిమా ఆలస్యమైందని అల్లు శిరీష్ అన్నారు. హీరోయిన్ పాత్రను హైలెట్ చేయాలని ఈ సినిమాకు ఊర్వశివో రాక్షసివో అనే టైటిల్ ను ఫిక్స్ చేయడం జరిగిందని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు లేవని శిరీష్ కామెంట్లు చేశారు. నాన్నగారికి నలుగురు సంతానం అని రెండో అన్నయ్య రాజేశ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని శిరీష్ తెలిపారు.

రోజుకు రెండు గంటల సమయం కేటాయించి బన్నీ పుష్ప మూవీ కోసం చిత్తూరు యాస నేర్చుకున్నాడని శిరీష్ కామెంట్లు చేశారు. నేను నటించిన గౌరవం మూవీ 98 శాతం మందికి నచ్చలేదని శిరీష్ పేర్కొన్నారు. యాక్టింగ్ కు సంబంధించి బన్నీని సలహాలు అడుగుతానని శిరీష్ చెప్పుకొచ్చారు. కమర్షియల్ గా విజయం సాధించానని అనుకోవడం లేదని శిరీష్ తెలిపారు. బాల్యంలో బన్నీ చాలా సైలెంట్ గా, డల్ గా ఉండేవాడని శిరీష్ అన్నారు.

బన్నీ ఎక్కువగా అల్లరి చేసేవాడు కాదని శిరీష్ చెప్పుకొచ్చారు. గంటలు గంటలు చదువుకునేవాడని అయితే చదివింది గుర్తుండేది కాదని శిరీష్ పేర్కొన్నారు. కారు అడిగితే నాన్న చెప్పుతో కొడతానని అన్నారని శిరీష్ వెల్లడించారు. ఏదో ఒకరోజు నాన్న గర్వపడేలా చేస్తానని శిరీష్ తెలిపారు. పెళ్లి చేసుకుంటే అమ్మ గర్వపడుతుందని శిరీష్ చెప్పుకొచ్చారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus