కొన్ని సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి అంచనాలకు మించిన విజయం సాధించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నాయి. నువ్వే కావాలి సినిమా నుంచి కాంతార సినిమా వరకు చాలా సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీల ఎంట్రీతో ప్రేక్షకుల అభిప్రాయం మారుతున్న నేపథ్యంలో ఇతర భాషల సినిమాలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మలయాళంలో గత నెలలో విడుదలైన ఒక సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది.
కేవలం 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో జయ జయ జయ జయహే పేరుతో తెరకెక్కిన సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. మలయాళ మూవీ ఈ స్థాయిలో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువు కాదు. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకుండానే ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
విపిన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కించగా దర్శన రాజేంద్రన్, బసిల్ జోసెఫ్ జంటగా ఈ సినిమాలో నటించడం గమనార్హం. స్వతంత్ర భావాలు గల అమ్మాయి కాబోయే భర్తకు పెళ్లి తర్వాత కూడా చదువుకుంటానని ఉద్యోగం చేస్తానని షరతులు విధించగా పెళ్లైన తర్వాత ఆ షరతుల విషయంలో అతను మాట తప్పుతాడు. భర్త తరచూ కోప్పడటం, చేయి చేసుకోవడంతో భర్తతో విడాకులు తీసుకోవాలని అమ్మాయి నిర్ణయం తీసుకుంటుంది.
ఈ నిర్ణయం వాళ్ల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే కథతో సినిమా తెరకెక్కింది. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కించడం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. కేవలం 42 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంది. ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందిస్తోంది.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!