Jr NTR: ఆ విధంగా తీసి ఉంటే మాత్రం శక్తి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదా?

  • July 18, 2023 / 04:07 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని డిజాస్టర్ సినిమాలలో శక్తి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత అశ్వనీదత్ ఈ మూవీ వల్ల 32 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చాలా సందర్భాల్లో చెప్పారు. దర్శకుడు మెహర్ రమేష్ ఇమేజ్ ను సైతం డ్యామేజ్ చేసింది. కథ, కథనంలోని పొరపాట్లు ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ కు కారణమయ్యాయని అభిమానులు భావిస్తారనే సంగతి తెలిసిందే.

అయితే మెహర్ రమేష్ మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) తయారు చేసిన కథ వేరని సినిమా తీసిన కథ వేరని సమాచారం. కంత్రీ తర్వాత మెహర్ రమేష్ సోషల్ ఫిల్మ్ ను తీయాలనుకుని ఎన్టీఆర్, అశ్వినీదత్ లకు కథ వినిపించగా వాళ్లిద్దరికీ ఆ కథ ఎంతగానో నచ్చేసింది. మెహర్ రమేష్ బన్నీ, వినాయక్ లకు ఈ కథ వినిపించగా వాళ్లకు సైతం కథ నచ్చింది. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ బృందావనం సినిమాతో బిజీ కావడంతో శక్తి మూవీ ఆలస్యమైంది.

అయితే ఆ తర్వాత అశ్వినీదత్ ఎన్టీఆర్ తో సోషియో ఫాంటసీ మూవీ తీయాలని భావించి కొంతమంది సీనియర్ రచయితలను పిలిపించి శక్తి కథలో మార్పులు చేశారట. ఎన్టీఆర్ తో మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమా తీయాలని అనుకున్నానని కానీ శక్తి లాంటి సినిమాను తీశానని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. 25 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా బడ్జెట్ చివరకు 45 కోట్ల రూపాయలు అయింది.

అధ్యాత్మిక కథల విషయంలో తనకు పెద్దగా అవగాహన లేకపోవడం శక్తి సినిమాకు మైనస్ అయిందని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రస్తుతం ప్రాజెక్ట్ కే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక భాగంగా తెరకెక్కుతుందో లేక రెండు భాగాలుగా తెరకెక్కుతుందో స్పష్టత రావాల్సి ఉంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus