Okkadu Movie: ఆ విషయంలో పట్టుబట్టిన మహేష్.. చివరకు?

కొన్ని సినిమాలు రికార్డులు సృష్టిస్తాయని ఆ సినిమా కథ విన్న సమయంలోనే హీరోలకు అర్థమవుతుంది. మహేష్ బాబు కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. భూమిక మహేష్ బాబుకు జోడీగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. అయితే ఒక్కడు సినిమాకు సంబంధించి అభిమానులకు కూడా తెలియని ఎన్నో షాకింగ్ విషయాలు ఉన్నాయి.

ఒక్కడు మూవీ కథ మహేష్ బాబుకు నచ్చగా ఆ సినిమాకు ఛార్మినార్ సెట్ కీలకమనే సంగతి తెలిసిందే. నిజమైన ఛార్మినార్ ను తలపించే విధంగా సెట్ వేయడం సులువైన విషయం అయితే కాదు. ఎమ్మెస్ రాజు మహేష్ తో సినిమా తీయాలనుకున్నా మరీ భారీ బడ్జెట్ మూవీ అంటే సంకోచించారు. ఆ సమయంలో ఎమ్మెస్ రాజు మనసంతా నువ్వే మూవీ హిట్టైతే ఆ డబ్బుతో ఒక్కడు తీస్తానని అన్నారు.

అయితే మహేష్ మాత్రం మనసంతా నువ్వే హిట్టైనా కాకపోయినా ఒక్కడు మూవీ మాత్రం కచ్చితంగా తీయాలని పట్టుబట్టారు. మనసంతా నువ్వే సక్సెస్ తర్వాత 14 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఎమ్మెస్ రాజు ఒక్కడు సినిమాను నిర్మించారు. ఈ సినిమా 2003 సంక్రాంతి కానుకగా రిలీజై సక్సెస్ సాధించింది. నీ స్నేహం సినిమా వల్ల ఎమ్మెస్ రాజుకు వచ్చిన నష్టాలన్నీ ఒక్కడు మూవీ కలెక్షన్లతో భర్తీ అయ్యాయంటే

ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో సులువుగానే అర్థమవుతుంది. ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరీర్ లోని మెమరబుల్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus