Prabhas: బాహుబలి2 రికార్డ్ భవిష్యత్తులో కూడా బ్రేక్ కావడం కష్టమేనా?

స్టార్ హీరో ప్రభాస్ కు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల క్రితం విడుదలైన బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఈ సినిమాకు చాలా రోజుల పాటు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ సినిమా టికెట్లను బ్లాక్ లో అమ్మి కొంతమంది లక్షాధికారులు అయ్యారని కామెంట్లు వినిపించాయి. ఎక్కువ రోజుల పాటు ఈ సినిమాకు కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లు వచ్చాయి.

పఠాన్ మూవీ బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని అందరూ భావించగా బాహుబలి2 సాధించిన రికార్డ్ ను ఈ సినిమా బ్రేక్ చేయలేదు. 35 రోజుల పాటు వరుసగా కోటి అంతకంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను బాహుబలి2 సొంతం చేసుకోగా పఠాన్ మూవీ మాత్రం 35వ రోజు కేవలం 75 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో ప్రభాస్ రికార్డ్ చెక్కు చెదరలేదు.బాహుబలి2 సాధించిన రికార్డును భవిష్యత్తులో కూడా బ్రేక్ చేయడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ రాజమౌళి కలిసి బాహుబలి2 సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు.

బుల్లితెరపై కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రభాస్ సలార్ సినిమాతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాల ఫలితాలే ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల ఫలితాలను డిసైడ్ చేయనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ సినిమాలు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ తన ప్రతి సినిమా కొత్తగా ఉండే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus