గానకోకిలగా పేరు సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించడంతో నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏడు దశాబ్దాల సంగీత ప్రయాణంలో లతా మంగేష్కర్ వేల సంఖ్యలో పాటలు పాడారు. లతా మంగేష్కర్ 1928 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇండోర్ లో జన్మించారు. ఐదు సంవత్సరాల వయస్సులోనే లతా మంగేష్కర్ సంగీతంపై ఆసక్తిని కనబరిచారు. 13 సంవత్సరాల వయస్సులోనే లతా మంగేష్కర్ తండ్రిని కోల్పోయారు. నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన లతా మంగేష్కర్ సింగర్ గా ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో లతా మంగేష్కర్ పీలగా ఉండటంతో ఆమె గొంతు పాటలు పాడటానికి పనికిరాదని కొంతమంది దర్శకులు విమర్శలు చేశారు. గజెభావు అనే మరాఠీ సినిమా కొరకు లతా మంగేష్కర్ తొలి పాటను పాడారు. తన సినీ కెరీర్ లో లతా మంగేష్కర్ 50,000కు పైగా పాటలను పాడటం గమనార్హం. ఆమె గాత్రానికి కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన గాయనిగా లతా మంగేష్కర్ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు.
2001 సంవత్సరంలో లతా మంగేష్కర్ కు భారతరత్న పురస్కారం లభించింది. తన సినీ కెరీర్ లో లతా మంగేష్కర్ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కలిసి పాడిన పాటలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే చాలా సంవత్సరాల క్రితం లతా మంగేష్కర్ పై విష ప్రయోగం జరిగింది. ఆమెకు ఆహారంలో ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారని వైద్యులు వెల్లడించారు. లతా మంగేష్కర్ ఆ సమయంలో కోలుకోవడానికి ఏకంగా మూడు నెలల సమయం పట్టింది.
ఆమె ఇంట్లో పని చేసిన వంటవాడే ఈ పని చేశాడని చాలామంది భావిస్తారు. లతా మంగేష్కర్ అస్వస్థతకు గురైన తర్వాత వంటవాడు జీతం కూడా తీసుకోకుండా పరారయ్యాడని తెలుస్తోంది. ఆమె ఉన్నతిని ఓర్వలేక ఆమె సంగీతరంగ ప్రత్యర్థులు వీషప్రయోగం చేయించారని సమాచారం.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!