పంజాబీ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ గాయకుడు అయిన సిద్ధూ మూసేవాలా ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఇదో రాజకీయ వార్త. కానీ చనిపోయే ముందు చేసిన ఓ మ్యూజిక్ ఆల్బమ్‌కి దగ్గర ఆయన మరణం ఉండటంతో ఆ ఆల్బమ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటా ఆల్బమ్, అందులో ఏముంది అనేది ఓసారి చూద్దాం. సిద్ధూ మూసేవాలాకి గన్ కల్చర్ అంటే ఇష్టం. గ్యాంగ్‌స్టర్స్‌ను హీరోల్లా భావించేవాడు.
అతని ప్రతి పాటలో ఆ ఆలోచనా శైలి స్పష్టంగా కనిపించేది. తన పాటల్లో చీకటి రాజ్యాన్ని పొగిడేవాడు. ఈ క్రమంలో కొన్ని వివాదాస్పద పాటలతో ప్రజల ఆగ్రహాన్ని కూడా చవిచూశాడు. ఎప్పుడూ గన్స్‌తో కనిపించే సిద్ధూ చివరికి వాటికే బలవుతాడని ఎవరూ ఊహించలేదు అంటున్నారు నెటిజన్లు. తన చివరి పాట ‘లాస్ట్ రైడ్…’ తరహాలోనే సిద్ధూ హత్య జరిగింది అని అంటున్నారు. దీంతో సిద్ధూ తన మరణాన్ని ముందే ఊహించినట్లు చెబుతున్నారు.
ఎనిమిది మంది దుండగులు ఏకే 94 రైఫిళ్లతో సిద్ధూ కారును చుట్టుముట్టి కాల్చి హత్య చేశారు. అతడి శరీరంలోకి సుమారు 20 తూటలు దూసుకెళ్లినట్లు సమాచారం. సిద్ధూ రెండు వారాల ముందు విడుదల చేసిన ‘ది లాస్ట్ రైడ్’ పాట కూడా ఇదే తరహాలో ఉంటుంది. అందులోని కొన్ని లిరిక్స్ ప్రస్తుత ఘటనకు దగ్గరగా ఉన్నాయని సిద్ధూ అభిమానులు చెబుతున్నారు. ‘ది లాస్ట్ రైడ్’ అనే పాటను సిద్ధూ తన అధికారిక యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేశాడు.
ఈ పాటను ఇప్పటివరకు కోటీ 80 లక్షల వ్యూస్‌తో కొనసాగుతోంది. ‘ది లాస్ట్ రైడ్’ పాటను సిద్ధూ చేసింది తనను ఉద్దేశించి కాదట. 25 ఏళ్ల వయసులో చనిపోయిన రాజపర్ టుపాక్ షకుర్ మరణాన్ని ఉద్దేశిస్తూ ఆ పాటను రూపొందించాడట. రాపర్ షకూర్‌ను దుండగులు కారులోనే కాల్చి చంపేశారు. దీంతో ఆ పాటలో ఆ ప్రస్తావన వస్తుంది. అతడి తరహాలోనే ఇప్పుడు సిద్ధూ మరణించడం గమనార్హం.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!