Tamanna , Vijay Varma: తమన్నా ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడితే నన్ను కొట్టాతారు.. హీరో గుల్షన్ దేవయ్య

గతకొన్ని రోజులుగా టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. న్యూ ఇయర్‌ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో ఓ సంచలనమే రేపింది. అయితే అది నిజమా? కాదా? వీడియోలో ఉన్నది వాళ్లేనా అనే దానిపై వీరిద్దరూ స్పందించలేదు. దాంతో వీళ్ల రిలేషన్‌పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వీరిద్దరూ పలు పార్టీలకు కలిసి వెళ్లినట్లు చాలా సార్లు మీడియా కంట కూడా పడ్డారు.

ఇదే విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా వీరిద్ధరూ స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ వీళ్లిద్దరి విషయం చెప్పాడు. విజయ్ వర్మ, తమన్నా రిలేషన్ షిప్ లో ఉన్నారా? లేదా? అన్నది నాకైతే తెలియదు. రెండు మూడు ఫొటోల్లో వారిద్దరూ కలిసి ఉండటం చూశాను. నేనెప్పుడూ ఆమెను కలవలేదు. తను ఎవరో కూడా తెలియదు. నేను ఇలా మాట్లాడటం చూసిందంటే ఆమె నన్ను కొట్టినా కొడుతుందేమో..

నోటికొచ్చింది వాగుతున్నావంటూ నా చెంప చెళ్లుమనిపిస్తుందేమో.. ఇప్పటికే ఆమె అభిమానులు నన్ను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఓ సందర్భాన్ని విజయ్ వర్మను ఏడిపించడం కోసం వాడుకున్నానంతే. దాంతో ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు అంటూ తమన్నా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సిరీయస్ గా చెప్పాలంటే వారి మధ్య ఏముందో నాకు ఏమాత్రం తెలియదు. అది వారి వ్యక్తిగత విషయం’ అని చెప్పాడు.

ఇక విజయ్‌ వర్మతో మిల్కీ బ్యూటీ (Tamanna) తమన్నా ప్రేమలో పడిందంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. న్యూ ఇయర్‌ వేడుకలు మొదలుకొని.. బాలీవుడ్‌లో ఏ ఈవెంట్‌ జరిగినా వీళ్లిద్దరూ కలిసి వెళ్తుండడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల ఓ డిన్నర్‌కు వెళ్లిన వీళ్లిద్దరూ ఒకే కారులో వెళ్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఫొటోగ్రాఫర్లకు హాయ్‌ చెబుతూ నవ్వుతూ ముందుకు సాగారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus