Prabhas: ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్ల వెనుక ఇంత కథ ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకులలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఒక్కో ప్రాజెక్ట్ కు ప్రభాస్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మీడియాలో ప్రభాస్ గురించి నెగిటివ్ కథనాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రభాస్ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడని, ప్రభాస్ విదేశాలకు వెళ్లాడని, ప్రభాస్ లుక్ మారిందని ఇలా ఎన్నో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పై నెగిటివ్ ప్రచారం ఆగితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. నెగిటివ్ వార్తలకు ప్రభాస్ ధీటుగా జవాబు ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎనిమిది నెలల గ్యాప్ లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయనే సంగతి తెలిసిందే.

వరుస విజయాలతో ప్రభాస్ బాక్ఫాఫీస్ ను షేక్ చేయడంతో పాటు తన రికార్డులను తానే బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు వేర్వేరుగా 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బిజినెస్ జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలో ప్రభాస్ మారుతి కాంబో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కూడా రానున్నాయని తెలుస్తోంది.

ఏడాదికి రెండు ప్రాజెక్ట్ లు విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఓర్వలేక కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ మార్కెట్ పెరుగుతోంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus