Mahesh Babu, Pawan Kalyan: జల్సా రీ రిలీజ్ కి సిద్ధమైన పవన్ ఫ్యాన్స్.. మొదలైన కొత్త ట్రెండ్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేసిన రచ్చ అంత ఇంత కాదు. నెలరోజుల ముందు నుంచి మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ప్లాన్ చేస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమాని స్పెషల్ షో ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే పోకిరి సినిమా రీ రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టించింది. పలు నివేదికల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ 1.75 కోట్ల రూపాయలు వసూలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇలా మహేష్ బాబు సినిమా విడుదలైన 15 సంవత్సరాల తిరిగి ప్రదర్శించబడితేనే ఈ రేంజ్ లో పాపులారిటీ రావడంతో మహేష్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఇక మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయడంతో పవన్ అభిమానులు కూడా మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో పవన్ అభిమానుల సైతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఆయన నటించిన జల్సా సినిమా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ తేదీ రికార్డ్ స్థాయిలో జల్సా సినిమాని విడుదల చేసి భారీ మొత్తంలో వసూలు రాబట్టాలని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చారు.

మహేష్ బాబు అభిమానులు పోకిరి సినిమాని ఓ స్థాయిలో విజయవంతం చేసి పవన్ అభిమానులకు మెంటల్ తెప్పించారని చెప్పాలి. మొత్తానికి మహేష్ బాబు పోకిరి సినిమా వసూళ్లను మించి జల్సా సినిమాతో వసూలు రాబట్టాలని పవన్ అభిమానులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.మరి ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది ఇకపోతే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా పోకిరి సినిమా రీ రిలీజ్ తో ఇండస్ట్రీలో మరో కొత్త ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus