రాజమౌళి తెలుగు సినిమా రేంజ్ ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళిన దర్శకుడు. ఎదో పెట్టిన పెట్టుబడికి తగినట్టు రాబడి వచ్చేస్తే చాలు.. ఎలాగూ స్టార్ డైరెక్టర్ ని కదా ఏమి తీసినా ప్రేక్షకులు చూసేస్తారు అన్న రీతిలో సినిమాలు తీయడు. ప్రేక్షకుడు పెట్టిన టికెట్ రేట్ కు … డబుల్ న్యాయం చేస్తుంటాడు మన జక్కన్న.
ఇక ఆయన తీసే సినిమాలకు సంబంధించి ఎటువంటి లీక్ లు జరుగకుండా చూసుకుంటాడు. 5 ఏళ్ళు కష్టపడి తీసిన ‘బాహుబలి’ విషయంలో ఎన్ని జాగ్రతలు తీసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా అదే విధంగా జాగ్రతలు తీసుకుంటున్నాడు. ఇక ఈ చిత్రంలో పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ మూడు పాటలు రాయాల్సి ఉందట.ఓ రచయితతో పాటలు రాయించుకోవాలంటే దర్శకుడు కథ లేదా ఆ సందర్భం గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వాల్సిందే. అలా మూడు పాటలు రాస్తున్న రచయితకి చాలా విశ్లేషణ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రాజమౌళి..’ఈ మూడు పాటలలోని కనీసం ఒక చరణం, కానీ పల్లవి కానీ మీ భార్యతో కూడా చెప్పకూడని నిభందన పెట్టారని… రచయిత అశోక్ తేజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.